నూతన సంవత్సర వేడుకల సమయంలో జరిగిర ఓ మహిళ హత్య డిల్లీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్యతో సంబంధమున్నట్లు అనుమానిస్తూ డిల్లీ బిజెపి మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

సౌత్ డిల్లీలోని ఓ ఫామ్ హౌస్ లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు అర్చన అనే వివాహిత తన భర్తతో కలిసి పాల్గొంది. ఇదే వేడుకలో బిజెపి మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పాల్గొన్నాడు. 

అయితే పార్టీ మధ్యలో ఏం జరిగిందో ఏమో గానీ రాజాసింగ్ తన గన్ తో అర్చనా సింగ్ పై కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగి వేడుకల్లో గందరగోళం నెలకొంది. ఈ దాడిలో తూటాలు శరీరంలోకి దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై అర్చన అక్కడికక్కడే మృతి చెందింది. 

ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో చేపట్టి నిందితుడు రాజాసింగ్ తో పాటు అతడి డ్రైవర్ హరి సింగ్ ను అరెస్ట్ చేశారు. 

నిందితుడు ఈ హత్యకు వాడిన పిస్టోల్‌తో పాటు కారును, ఫామ్ హౌస్ ను పోలీసులు సీజ్ చేశారు. నిందితులకు కోర్టులో ఏడు రోజుల కస్టడీ విధించింది. దీంతో డిల్లీ పోలీసులు
వారిని జైలుకు తరలించారు.