హిందూ దేవతలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటరిచ్చింది. శామ్ పిట్రోడా దుర్మార్గుడంటూ వ్యాఖ్యానించారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ.

రాహుల్ గాంధీ సన్నిహితుడు శామ్ పిట్రోడా అమెరికాలో ప్రసంగిస్తూ శ్రీరాముడు, హనుమంతుడు, మందిరంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ .. పిట్రోడా భారతదేశాన్ని 'దూషించినందుకు' గాను ట్విట్టర్‌ ద్వారా మండిపడ్డారు. ఆయన రాహుల్ గాంధీ 'హిందూఫోబిక్ డైట్రైబ్'కు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ సహచరుడైన శామ్ పిట్రోడా, దుర్మార్గుడంటూ ఆయన వ్యాఖ్యానించారు. అతను తన సహోద్యోగి కొడుకును బేబీగా కూర్చోబెట్టగలగవచ్చు.. కానీ ఎలాంటి ఆధారం లేకుండా భారతదేశాన్ని దూషించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు మాలవీయ ఓ వీడియోను పంచుకున్నారు. 

అందులో పిట్రోడా అమెరికాలో మాట్లాడుతూ.. రాముడు, హనుమాన్, మందిరం వంటివి ప్రస్తుతం భారత్‌లో చర్చలకు కేంద్రంగా వున్నాయన్నారు. అదే సమయంలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, విద్య, ఆరోగ్యం వంటి సమస్యలు వెనుకబడిపోయాయన్నారు. దేవాలయాల వల్లే ఉద్యోగాలు రావట్లేదని పిట్రోడా వ్యాఖ్యానించారు. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ 2023లో 4.7 శాతానికి తగ్గిందని, ఇది 18 నెలల కనిష్ట స్థాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మాలవీయ చురకలంటించారు. 

Scroll to load tweet…

టోకు ద్రవ్యోల్భణం ప్రతికూల జోన్‌లో వుందని.. ఇదే కాలానికి -0.92 శాతం (34 నెలల కనిష్ట స్థాయి). భారతదేశ ద్రవ్యోల్భణం అమెరికా కంటే చాలా తక్కువగా వుందన్నారు. ఉదాహరణకు పిట్రోడా అని నివసించే దేశమని మాలవీయ చురకలంటించారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రతికూల పరిస్ధితుల్లోనూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలతో పోలిస్తే ఉపాధి విషయంలో భారతదేశం చాలా మెరుగ్గా వుందన్నారు. 

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా వున్న శామ్ పిట్రోడా .. లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్ధించినప్పడు కూడా ఎదురుదెబ్బ తగిలిందని మాలవీయ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో వున్నారు. పది రోజుల పర్యటన నిమిత్తం జూన్ 2న అగ్రరాజ్యానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ స్థిరపడిన భారతీయులతో ముచ్చటిస్తున్నారు. జూన్ 5న అతను న్యూయార్క్‌ను సందర్శించాడు. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరంలో జావిట్స్ సెంటర్‌లో భారతీయ ప్రవాసుల సభ్యులతో సంభాషించాడు. 

మరోవైపు.. రిపబ్లిక్‌ టీవీతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారతదేశాన్ని అవమానించడం అలవాటుగా చేసుకున్నారని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని.. దీనిని అరికట్టాలని పూరీ వ్యాఖ్యానించారు. విదేశాల్లోని భారతీయుల నుంచి తమకు విశేషమైన సానుకూల స్పందన లభిస్తోందని కాంగ్రెస్ చెబుతోందని ఆయన దుయ్యబట్టారు. భారత్‌లో మైనారిటీలు సురక్షితంగా లేరని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రమాదంలో వుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.