Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు హాజరుకాకుండా తనను ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందనీ, ఈ క్రమంలోనే కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోందని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో డీకే తో పాటు ఆయన సోదరుడు డీకే సురేష్‌ల వాంగ్మూలాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాలుగు గంటలకు పైగా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Karnataka Congress chief DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.. కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు హాజరు కావడం అధికార బీజేపీకి ఇష్టం లేదని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు జారీ చేసిన సమయాన్ని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రకు హాజరుకాకుండా తనను ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందనీ, ఈ క్రమంలోనే కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోంది ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ శుక్రవారం ఢిల్లీలోని ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. భారత్ జోడో యాత్ర కర్ణాటకకు చేరుతున్న క్రమంలోనే తనను ప్రశ్నించడం ఆలస్యం చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు విజ్ఞప్తి చేశారు. అయితే, దీనిని ఈడీ తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆయన, కేంద్ర ఏజెన్సీ, బీజేపీ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.
"ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నల మొదటి దశ విచారణ ముగిసింది. వారు కొన్ని పత్రాలను అడిగారు. వారు రెండు లేదా మూడు రోజుల్లో పత్రాలను సమర్పించాలని కోరారు, కానీ నేను మరింత సమయం కోరాను. యంగ్ ఇండియా కంపెనీకి నేను విరాళం ఇవ్వడం గురించి వారు నన్ను ప్రశ్నించారు" అని డీకే శివకుమార్ తెలిపారు. "ఈ సంస్థను నెహ్రూజీ, గాంధీజీ ప్రారంభించారు. మా సంస్థ ద్వారా దాని అభివృద్ధికి కొంత విరాళం ఇవ్వాలని నేను వారితో చెప్పాను. వారు ఆ డబ్బును పొందడానికి మూలాలను అడిగారు, నేను ఎందుకు విరాళం ఇచ్చాను. ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించారు. పత్రాలను సమర్పించడానికి 2-3 రోజుల సమయం ఇవ్వండి అని నేను చెప్పాను” అని డీకే తెలిపారు. కర్ణాటకలోని బలమైన వొక్కలిగ మఠంలో ఒకటైన ఆది చుంచుంగిరి మఠానికి పార్టీ అధినేత రాహుల్ గాంధీ వస్తున్న రోజున కేంద్ర ఏజెన్సీ తనను విచారణకు పిలిచిందని డీకే శివకుమార్ ఆరోపించారు. కాగా, నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో డీకే తో పాటు ఆయన సోదరుడు డీకే సురేష్‌ల వాంగ్మూలాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాలుగు గంటలకు పైగా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
శివకుమార్ బలమైన వొక్కలిగ నాయకులలో ఒకరనీ, ర్యాలీ మఠానికి చేరుకోవడానికి ముందే తనను లక్ష్యంగా చేసుకోవడం బీజేపీ సర్కారు కుట్ర అని ఆరోపించారు. "రాహుల్ గాంధీ మా మఠం (వొక్కలిగ మఠం)లో ఉన్నారు. నేను లేను. ఈరోజు వాళ్లు నాకు ఫోన్ చేశారు. నేను లేను, ప్రోగ్రామ్ అయిపోయింది. ఈరోజు ఎందుకు ఫోన్ చేయాలి? ఏంటి తొందర? మరొక రోజు మరియు నేను 23వ తేదీ తర్వాత మరేదైనా విచారణకు వస్తానని కూడా చెప్పాను. కానీ వారు దానిని ఒప్పుకోకుండా నన్ను ఈ రోజు ఎందుకు పిలిపించవలసి వచ్చింది?" అని డీకే శివకుమార్ ప్రశ్నించారు. కాగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్యినియోగం చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ కక్ష్యతో ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారని కూడా మండిపడుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు పలుమార్లు ప్రస్తావించాయి. బీజేపీ నాయకులకు చెందిన పెద్దపెద్ద అక్రమాలు బయటపడిన కేంద్ర ఏజెన్సీలు పట్టించుకోకపోవడం దీనికి ఉదాహరణగా పేర్కొంటున్నాయి.
