Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీపై ట్వీట్... నటి పై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్..

ప్రధాని నరేంద్ర మోదీని కించపరుస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన తమిళనాడు హాట్ బ్యూటీ ఒవియా హెలెన్ మీద బీజేపీ మండిపడుతోంది. ఆమె మీద వెంటనే పోలీస్ కేసు నమోదు చేయాలని తమిళనాడు బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

BJP complaints against actor oviya over tweet on modi in tamilandu tour - bsb
Author
Hyderabad, First Published Feb 15, 2021, 4:42 PM IST

ప్రధాని నరేంద్ర మోదీని కించపరుస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన తమిళనాడు హాట్ బ్యూటీ ఒవియా హెలెన్ మీద బీజేపీ మండిపడుతోంది. ఆమె మీద వెంటనే పోలీస్ కేసు నమోదు చేయాలని తమిళనాడు బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈ మేరకు రాష్ట్ర బీజేపీ చీఫ్ డీ అలెక్స్ సుధాకర్ స్థానిక పోలీసులకు ఆమె మీద ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తమిళనాడు పర్యటించిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 

రూ. 3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్ మెన్ పేట, విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ. 293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్‌, అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్ లో, రూ. 423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం, తంజావూరు, తిరువారూర్ మార్గాల్లో రైలు సేవలకు జెండా ఊపారు. చెన్నై నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్ని ప్రసంగించారు.

అయితే ఈ క్రమంలో మోదీ రాకను నిరసిస్తూ నటి ఒవియా హెలెన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. గో బ్యాక్ మోదీ అనే హ్యష్ ట్యాగ్ తో చేసిన ఈ పోస్టు వివాదాస్పదంగా మారింది. ఒవియా అలా పోస్ట్ చేయడం మీద బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

దేశద్రోహం, ఐటీ చట్టం కింద ఆమెపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇండియన్ మోడల్ అయి ఒవియా పేరు అందరికీ తెలియకపోయినా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే. 

విలక్షణ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వచ్చిన తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో ఈ కేరళ కుట్టి పాల్గొంది. బిగ్ బాస్ షోతో ఒవియా కోలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది.  తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 40కి పైగా చిత్రాల్లో ఒవియా నటించింది. వరుసగా  కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ కూడా చేస్తుంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios