Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సమయం: బీజేపీ నేత సంచలనం

రానున్న 15 రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు కూడ రాజీనామా చేయడం ఖాయమని మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు. అంతేకాదు  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సమయం రానుందని  ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

BJP Claims "2 More Maharashtra Ministers Will Quit," Calls It "Fit Case For President's Rule" lns
Author
Mumbai, First Published Apr 8, 2021, 5:40 PM IST


ముంబై: రానున్న 15 రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు కూడ రాజీనామా చేయడం ఖాయమని మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు. అంతేకాదు  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సమయం రానుందని  ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కేబినెట్ నుండి ఎవరో వైదొలుగుతారో అనే విషయమై ఆయన ప్రకటించలేదు.  రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో వాజే సర్కార్ ను మహారాష్ట్రలోని సేన-ఎన్సీపీ సంకీర్ణ సర్కార్ వెనకేసుకొచ్చిందని ఆయన విమర్శించారు.

మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణకు ముంబై హైకోర్టు ఆదేశించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మరో వైపు ఈ విచారణను నిలిపివేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్ దేశ్ ముఖ్ సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

తాను సర్వీసులో కొనసాగాలంటే రూ. 2 కోట్లు చెల్లించాలని హోంమంత్రి తనను డిమాండ్ చేశారని  సచిన్ వాజే ఆరోపించారు. అంతేకాదు మరో ఇద్దరు మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఎన్ఐఏ సచిన్ వాజే లేఖ రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios