బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బుధవారం రాత్రి దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. స్వైన్ ఫ్లూ కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

‘నాకు స్వైన్‌ ఫ్లూ వచ్చింది. చికిత్స జరుగుతోంది. భగవంతుడి దయ, మీ అందరి ఆశీర్వాందంతో త్వరలోనే కోలుకుంటా’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఛాతీ పట్టేయడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర కారణాలతో అమిత్‌ షాను ఆసుపత్రిలో చేర్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అమిత్‌ షాను ఆసుపత్రిలో పరామర్శించారు.