గెలుపు ఇచ్చే కిక్ మరేది ఇవ్వలేదంటారు పెద్దలు.. మరి ఎంతో కష్టం తర్వాత విజయం వరిస్తే.. ఆ వ్యక్తికి పట్టపగ్గాలు ఉంటాయా..? ఆ సమయంలో ఏం చేస్తున్నామన్నది కూడా మనకు తెలియదు. ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో ఓ వ్యక్తి చొక్కా విప్పి గంతులేశాడు.

కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బాగల్‌కోట్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వీరప్ప సిరగన్నవార్ ఓ వార్డ్‌కు కౌన్సిలర్‌గా బరిలో నిలిచాడు. తన గెలుపుకోసం ఎంతో శ్రమించిన ఆయన.. ఈ రోజు కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల్లో ఫలితాల్లో తాను గెలిచినట్లు ప్రకటించగానే ఆనందం తట్టుకోలేకపోయాడు. వెంటనే చొక్కా విప్పి... గంతులేసుకుంటూ.. చొక్కాను గాల్లో తిప్పుతూ వీధుల్లో సందడి చేశాడు. దీనిని కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది.