Asianet News TeluguAsianet News Telugu

ఐదు రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఎన్నికలు: ఇంచార్జీలను ప్రకటించిన బీజేపీ

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇంచార్జీలను నియమించింది ఆ పార్టీ. యూపీ రాష్ట్రానికి ధర్మేంద్ర ప్రధాన్, పంజాబ్‌ రాష్ట్రానికి గజేంద్ర షెకావత్, మణిపూర్ కి భూపేంద్ర యాదవ్, గోవాకు దేవేంద్ర ఫడ్నవీస్, ఉత్తరాఖండ్ కు ప్రహ్లద్ జోషీలను ఇంచార్జీలుగా నియమించింది.

BJP appoints election in-charges for poll-bound states
Author
New Delhi, First Published Sep 8, 2021, 12:54 PM IST

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇంచార్జీలను ప్రకటించింది. 2022 ఎన్నికల్లో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుండే పావులు కదిపేందుకు గాను బీజేపీ ఇప్పటినుండే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఇంచార్జీలను నియమించింది. 

యూపీ రాష్ట్రానికి ధర్మేంద్ర ప్రధాన్, పంజాబ్‌ రాష్ట్రానికి గజేంద్ర షెకావత్, మణిపూర్ కి భూపేంద్ర యాదవ్, గోవాకు దేవేంద్ర ఫడ్నవీస్, ఉత్తరాఖండ్ కు ప్రహ్లద్ జోషీలను ఇంచార్జీలుగా నియమించింది.యూపీ రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా విభజించింది. సంజయ్ భాటియాను (యూపీ వెస్ట్), సంజీవ్ చౌరాసియాను(బ్రాజ్) వై.సత్యకుమార్ (అవాథ్) సుధీర్ గుప్తా(కాన్పూర్) అరవింద్ మీనన్( గోరఖ్ పూర్), సునీల్ ఓఝా (కాశీ) రీజియన్లకు ఇంచార్జీలుగా నియమించారు. 

వచ్చే ఏడాదిలో జరిగే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలున్న రాష్ట్రమైన యూపీని  బీజేపీకి అత్యంత కీలకమైంది. ఈ రాష్ట్రంలో మరోసారి పాగా వేయాలని ఆ పార్టీ  ప్లాన్ చేస్తోంది. అయితే బీజేపీ నుండి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఎస్పీ, బీఎస్పీలు ప్లాన్ చేస్తున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios