న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి  మీకు ఎంత బాగా తెలుసుననే విషయమై బీజేపీ ఓ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 

మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మోడీతో పాటు బీజేపీకి సంబంధించిన అంశాలపై ఈ క్విజ్ లో ప్రశ్నలు ఉంటాయి. ఈ మేరకు నమో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని బీజేపీ కోరింది.ఈ మేరకు ట్విట్టర్ లో నమో యాప్ కు సంబంధించిన లింక్ ను బీజేపీ పోస్టు చేసింది.

 

నమో యాప్ ద్వారా నిర్వహించే క్విజ్ లో పాల్గొనేందుకు 1800 2090920 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడ పాల్గొనవచ్చు.ఈ క్విజ్ లో విజేతలైన వారికి ప్రధాని మోడీ స్వయంగా సంతకం చేసిన పుస్తకాలు అందిస్తారు. 

మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 2014లో మోడీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019లో కూడ రెండోసారి మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2014 కంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు దక్కాయి.