Asianet News TeluguAsianet News Telugu

బీజేపీకి మరోషాక్.. కేంద్రమంత్రి రాజీనామా

 సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు సమయం ఉందనగా  రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయే ప్రభుత్వంతో ఉన్న మైత్రికి స్వస్తి పలికారు. 

BJP Ally Upendra Kushwaha Quits As Minister, Will Attend Opposition Meet
Author
Hyderabad, First Published Dec 10, 2018, 2:51 PM IST


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు సమయం ఉందనగా  రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయే ప్రభుత్వంతో ఉన్న మైత్రికి స్వస్తి పలికారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఇవాళ ఢిల్లీలోజరుగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి తాను హాజరు కావడం లేదంటూ కుశ్వాహ చెప్పిన కొద్దిసేపటికే... ఆయన ఎన్డీయేలో కొనసాగుతారా, లేదా అన్నదానిపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కుశ్వాహ ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం గమనార్హం.
 
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీకి ఒక్క సీటు కంటే ఎక్కువ ఇచ్చేందుకు బీజేపీ తిరస్కరించడంతో.. కుశ్వాహ ఇటీవల ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు  మరోవైపు బీహార్‌లో కుశ్వాహ పార్టీకి ఒక్క సీటుకంటే ఎక్కువ ఇవ్వబోమని చెప్పిన కాషాయ పార్టీ... సీఎం నితీశ్ సారథ్యంలోని జేడీయూతో మాత్రం సమాన సంఖ్యలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయన తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. 

అంతేకాకుండా.. బీజేపీ వ్యతిరేక కూటమిలంతా కలిసి ఈ రోజు సమావేశమౌతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ఉపేంద్ర కుశ్వాహా హాజరయ్యే అకవాశం ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios