పుట్టిన రోజు అనగానే ఎవరైనా చాక్లెట్లో, స్వీట్లో పంచి పెడతారు. ఇది సర్వసాధారణం. బదులుగా ఆ స్వీట్లు తీసుకున్నవాళ్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారు. అయితే.. ఓ అధికారి మాత్రం తన వద్ద పనిచేసే సహోద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆమె స్వీట్ ఇవ్వగానే.. చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెక్ చేసుకొని బలవంతంగా ఆమెకు ముద్దుపెట్టాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వట్లకుండి ప్రాంతానికి చెందిన గోపీనాథ్ అనే వ్యక్తి దుండిగల్ జిల్లాలోని వేదసందూర్ పనోరమలో పంచాయతీ ఎగ్జిగ్యూటివ్ గా పనిచేస్తున్నాడు. కాగా.. అదే ఆఫీసులో ఓ మహిళ టెంపరీరీ ఉద్యోగిని గా పనిచేస్తోంది.

ఇటీవల ఆమె పుట్టిన రోజుగా.. ఆఫీసులో అందరికీ స్వీట్లు పంచిపెట్టింది. గోపినాథ్ అక్కడ ఉన్నతాధికారి కాగా.. అతనికి కూడా ఆమె మర్యాదపూర్వకంగా స్వీట్ ఇచ్చింది

 

ఆ స్వీట్ అందుకున్న గోపీనాథ్.. సదరు ఉద్యోగిని పట్ల నీచంగా ప్రవర్తించాడు. స్వీట్ తీసుకున్నట్లే తీసుకొని.. చుట్టూ ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెక్ చేసుకున్నాడు. అనంతరం ఆమెను బలవంతంగా గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టేశాడు.

కాగా.. ఈ ఘటన మొత్తం ఆఫీసులోని సీసీకెమేరాలో రికార్డు అయ్యింది. ఆ ఆఫీసులో పనిచేసేవారెవరో దానిని సోషల్ మీడియాలో పెట్టగా వీడియో కాస్త వైరల్ గా మారింది. కాగా..  ఈ వీడియో కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. గోపీ నాథ్ ని సస్పెండ్ చేశారు.

కాగా.. ఆ వీడియో అసలైనది కాదని.. కావాలనే తనను చెడుగా చిత్రీకరించడానికి ఈ వీడియోలో తాను ఉన్నట్లు మార్ఫింగ్ చేశారంటూ గోపీనాథ్ ఆరోపించడం విశేషం. అయితే.. ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేపట్టి అతను తప్పు చేశాడని తెలుసుకొని విధుల్లో నుంచి తొలగించారు.