న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని పౌల్ట్రి ఉత్పత్తుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని అధికారులు తేల్చారు. దేశంలోని 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది.

ఢిల్లీలోని ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్ ను  అధికారులు మూసివేశారు. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ గా ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్ ను అధికారులు మూసివేశారు.బర్డ్ ఫ్లూ నిర్ధారణ కోసం ఘాజీపూర్ నుండి మొత్తం 104 శాంపిళ్లను సేకరించారు. వీటిలో 100 శాంపిళ్లను కేవలం ఘాజీపూర్ మార్కెట్ పౌల్ట్రీ నుండే తీసుకొన్నారు. వీటిలో బర్డ్ ఫ్లూ నెగిటివ్ వచ్చిందని చెప్పారు.

ఢిల్లీ కోళ్లలో బర్డ్ ఫ్లూ స్పష్టమైందని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం బాతుల్లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు కన్పించాయి. దీంతో ముందుజాగ్రత్తగా కోళ్ల శాంపిళ్లను సేకరించారు అధికారులు. ఘాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్ ను మూసివేయడంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో  ఎక్కడా పౌల్ట్రీ ఉత్పత్తులను విక్రయించరాదని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.

దేశంలోని పలు రాష్ట్రాలను ఇప్పటికే బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడ ఇదే రీతిలో ధరలు తగ్గిపోతున్నాయి.