శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఆ ఇద్దరు మహిళలు మళ్లీ ప్రయత్నిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత తొలిసారిగా బింధు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

కాగా.. ఈ ఇద్దరు మరోసారి శబరిమలకు వెళ్లనున్నారు. ఈ నెల 12వ తేదీన అయ్యప్పను దర్శించుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ ఇద్దరు మహిళలు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

మొదటి సారి వీళ్లద్దరూ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కనకదుర్గని అయితే.. కనీసం అత్తింటివారు ఇంట్లోకి కూడా రానివ్వలేదు. సొంత అత్తే ఆమెపై దాడి చేసింది. భర్త ఆమెను వదిలి పిల్లలతో సహా దూరం గా వెళ్లిపోయాడు. ఇంత జరిగినా.. వాళ్లు మళ్లీ ఆలయంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

కనీసం అయ్యప్ప మాల కూడా వేసుకోకుండా వీళ్లు ఆలయంలోకి ప్రవేశించడం సరికాదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. తొలిసారి ఆలయంలోకి వెళ్లినసమయంలో కూడా వీళ్లు అయ్యప్ప మాల ధరించలేదని ఆరోపణలు ఉన్నాయి.