Asianet News TeluguAsianet News Telugu

స్నేహితురాలిని హత్య చేసిన యువకుడు.. నాలుగు రోజులుగా మెడిక‌ల్ షాపులోనే మృతదేహాం !

Bilaspur: స్నేహితురాలిని హ‌త్య చేసిన ఒక యువ‌కుడు.. నాలుగు రోజులుగా మృతదేహాన్ని త‌న మెడిక‌ల్ షాపులోనే ఉంచాడు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు మృతదేహాన్ని జనపనార గుడ్డ, టార్పాలిన్ షీట్‌లో చుట్టి తన కారులో ఇంటికి తీసుకెళ్తుండగా పోలీసులకు ప‌ట్టుబ‌డ్డాడు. 
 

Bilaspur : young man who murdered his girlfriend; Body found in medical shop for four days
Author
First Published Nov 21, 2022, 4:02 AM IST

Youth killed girlfriend In Chhattisgarh: మ‌రో షాకింగ్ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. డ‌బ్బుల వివాదం నేప‌థ్యంలో ఒక యువ‌కుడు త‌న స్నేహితురాలిని హ‌త్య చేశాడు. నాలుగు రోజులుగా మృతురాలి డెడ్ బాడీని త‌న మెడిక‌ల్ షాపులోనే ఉంచాడు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు మృతదేహాన్ని జనపనార గుడ్డ, టార్పాలిన్ షీట్‌లో చుట్టి తన కారులో ఇంటికి తీసుకెళ్తుండగా పోలీసులకు ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుందని న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదించింది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత క‌థ‌నం ప్ర‌కారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో మరో భయానక సంఘటన వెలుగులోకి వ‌చ్చింది. ఓ మెడికల్ స్టోర్ యజమాని ఆశిష్ సాహు తన స్నేహితురాలు ప్రియాంకను హ‌త్య చేశాడు. దీనివెనుక డబ్బు కార‌ణంగా ఉంద‌ని స‌మాచారం. అయితే, స్నేహితురాలిని హ‌త్య చేసిన నిందితుడు మృతదేహాన్ని పారవేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తూ.. నాలుగు రోజులుగా డెడ్ బాడీని త‌న  మెడిక‌ల్ షాపులోని ఉంచాడు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు మృతదేహాన్ని జనపనార గుడ్డ, టార్పాలిన్ షీట్‌లో చుట్టి తన కారులో ఇంటికి తీసుకెళ్తుండగా పోలీసులు ప‌ట్టుకుని  అరెస్టు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ‌బ్బుల విష‌యంపై వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భిలాయ్‌కు చెందిన ప్రియాంక బిలాస్‌పూర్‌లోని తన కోచింగ్ తరగతుల కోసం హాస్టల్‌లో ఉండి రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌యాంక‌కు నిందితుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. "ప్రియాంక నిందితులతో పరిచయం ఏర్పడింది. వారు కలిసి స్టాక్ మార్కెట్లలో డబ్బును పెట్టుబడి పెట్టడంలో నిమగ్నమై ఉన్నారు. షేర్ మార్కెట్‌లో నష్టాలు రావడంతో ఆమె బహిరంగ మార్కెట్‌లో అప్పు తీసుకున్నందున రూ. 11 లక్షలను తనకు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిందని" బిలాస్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరుల్ మాథుర్ తెలిపిన‌ట్టు టీఎన్ఐఈ నివేదించింది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

బిలాస్‌పూర్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులో సాహు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. “కుటుంబ సభ్యులు ఇద్దరూ ఒకరికొకరు తెలిసిన వారనీ, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి వ్యాపారంలో పాలుపంచుకున్నారని వెల్లడించారు. కాబట్టి, ఇత‌ను ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడు. మిస్సింగ్ కేసుపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే మెడిక‌ల్ షాపు, ప‌రిస‌ర నివాసంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీతో పాటు అతని కదలికను నిశితంగా పరిశీలించగా ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది. చివ‌ర‌కు నిందితుడు త‌న నేరాన్ని అంగీక‌రించాడు అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

"ఆమెను చంపిన తర్వాత, సాహు తన మెడికల్ షాపును నవంబర్ 15 నుండి మూసి ఉంచాడు. సీసీటీవీ క్లిప్పింగ్ కూడా ఒక అమ్మాయి మెడికల్ షాప్‌లోకి ప్రవేశించినట్లు చూపించింది. అయితే, తిరిగి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌లేదు. సాహు మృతదేహాన్ని పారవేసేలోపు, పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు" అని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రదీప్ ఆర్య తెలిపారు. "శరీరం కుళ్ళిపోయిన దశలో ఉంది. ప్రాథమికంగా ఇది గొంతు కోయడం వల్ల జరిగిన హత్యగా కనిపిస్తుంది. అయితే మరణానికి ఖచ్చితమైన కారణం పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత మాత్రమే తెలుస్తుంది”అని మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత ఫోరెన్సిక్ సైంటిస్ట్ అధికారి ప్రవీణ్ సోని చెప్పారు. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios