బీజాపూర్: చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డ మావోయి 22మందిని బలితీసుకున్నారు. అయితే ఇప్పటికే మరో 30మంది గాయపడగా మరో  21మంది గల్లంతయ్యారు. గల్లంతయిన వారికోసం గాలింపు కొనసాగుతోంది. 

ఈ ఎన్కౌంటర్ పై బిజాపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కమలోచన్ కాశ్యప్ స్పందించారు. ఇలా భారీసంఖ్యలో భద్రతా సిబ్బంది మృత్యువాతపడటం బాధాకరమన్నారు. ఇవాళ(ఆదివారం)15 మృత దేహాలను  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

కూంబింగ్ కు వెళ్తున్న 660 మంది జవాన్లపై మావోయిస్టులు దాడికి దిగారు. జవాన్లపై మావోయిస్టులు అదును చూసి దెబ్బకొట్టారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఆధునాతన ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 22 మంది జవాన్లు మరణించారు.  

ఈ కాల్పుల తర్వాత సుమారు 21 మంది జవాన్ల ఆచూకీ కన్పించకుండా పోయింది. జాయింట్ సెక్యూరిటీ ఫోర్స్, యాంటీ నక్సల్స్ ఆపరేషన్ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ కు వెళ్తున్న సమయంలో  మావోయిస్టులు కాల్పులకు దిగినట్టుగా ఎస్పీ తెలిపారు.