కేరళలో ఓ మూక దాడి జరిగింది. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి దొంగ అనే ఆరోపణతో మూక దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మలప్పురంలో చోటుచేసుకుంది.
తిరువనంతపురం: కేరళలో ఓ మూక దాడి జరిగింది. ఓ బిహారీ దొంగిలించాడని ఓ మూక అతనిపై దారుణంగా దాడి చేసింది. కర్రలు, ప్లాస్టిక్ పైపుల చికతబాదింది. దెబ్బలకు తాళలేక ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన కేరళలోని మలప్పురంలోని కీళిస్సెరీలో చోటుచేసుకుంది.
బిహార్‌కు చెందిన రాజేశ్ మంచి అనే 36 ఏళ్ల వ్యక్తి కేరళలో ఉంటున్నారు. రాజేశ్ మంచి దొంగతనం చేశాడని కొందరు నిందితులు ఆయనపై దాడి చేశారు. దీంతో రాజేశ్ ఛాతి, పక్కటెముకలు, నడుము భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. మే 12వ తేదీ రాత్రి కీళిస్సెరీలో రాజేశ్ మంచి మృతదేహం లభించింది. దొంగతనం గురించి అడుగుతూనే ఆయనపై ఆ మూక దాడికి దిగినట్టు మలప్పురం ఎస్పీ సుజీత్ దాస్ తెలిపారు. చేతులు కట్టేసి సుమారు రెండు గంటలపాటు కొట్టారని వివరించారు. ఆ ఘటనను కూడా కొందరు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు పోలీసుల వద్ద ఉన్నది.
కొందరు స్థానికులు ఈ ఘటన గురించి పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు స్పాట్‌కు వచ్చారు. అప్పడు రాజేశ్ మంచి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతడిని హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే మరణించినట్టు వైద్యులు స్పష్టం చేశారు.
Also Read: స్వాతంత్ర్య సమరంలో పరదా సంప్రదాయాన్ని పక్కనపెట్టిన నిశత్ ఉన్నీసా బేగం గురించి తెలుసా?
తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాజేశ్ మంచి ఒక దొంగ అని నిందితులు చెప్పినట్టు వివరించారు. పోలీసులు ఈ కేసులో సమగ్రమైన రీతిలో దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కొండొటట్ి ఏఎస్పీ సారథ్యంలో ఓ ప్రత్యేక బృందం ఈ కేసును విచారిస్తున్నది.
