పాట్నా: శంకేష దేవీ, ఆమె అత్త దుర్గావతి దేవీలకు కోర్టు మరణశిక్ష విధించింది. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లా నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

నాలుగేళ్ల బాలుడిని చంపినందుకుగాను కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. 2017 సెప్టెంబర్ 5వ తేదీన గోపాల్ గంజ్ జిల్లాలోని విజయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చితౌనాలో ఈ ఘటన చోటు చేసుకొంది.

శంకేష దేవీకి మగ పిల్లలు లేరు. దీంతో నాలుగేళ్ల బాలుడిని  బలి ఇస్తే మగ పిల్లలు పుడుతారని  కొందరు చెప్పారు. ఈ విషయాన్ని ఆమె నమ్మింది. ఈ విషయమై ఆమె అత్త దుర్గావతి దేవీలతో కలిసి బాలుడిని బలి ఇచ్చారు.

ఇదే ప్రాంతంలో నివాసం ఉండే కుమార్ అనే నాలుగేళ్ల బాలుడిని శంకేష దేవీ అత్త సహాయంతో తమ బెడ్ రూమ్ లోనే బాలుడిని బలి ఇచ్చారు. డెడ్ బాడీని తమ ఇంటికి సమీపంలోని పొలాల్లో పారేశారు. ఈ విషయమై పోలీసుల విచారణలో శంకేషదేవీ ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

శంకేషదేవీకి పిల్లలు లేరు. మగపిల్లాడిని బలి ఇస్తే పిల్లలు కలుగుతారని భూత వైద్యులు చెప్పడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.