బిహార్‌లో ఓ దుండగుడు అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు. రెండేళ్లుగా ఆమెను భర్త, ఆమె తల్లిదండ్రులు కట్నం కోసం వేధించారు. చివరకు ఆమెను హత్య చేసి ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యలా చిత్రించాలని ప్రయత్నించినట్టు తెలుస్తున్నది.

పాట్నా: బిహార్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం ఓ భర్త ఉన్మాదిగా మారాడు. కట్టుకున్న భర్తను కడతేర్చడానికి కూడా వెనుకాడలేదు. భర్త, ఆయన తల్లిదండ్రులు అంతా ఆమెను అంతమొందించాలని, ఆ తర్వాత హత్యను ఆత్మహత్యగా చిత్రించాలని ప్లాన్ వేశారు. అనుకున్నట్టుగానే అదనపు కట్నం తేవడం లేదని ఆమెను చంపేసి ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టుగా వేలాడదీశారు. ఈ ఘటన పాట్నాలోని దుల్హిన్ బజార్‌లో బుధవారం చోటుచేసుకుంది.

బిహార్‌లోని పాలిగంజ్‌కు చెందిన 21 ఏళ్ల పర్వానా పర్వీన్‌కు 2019లో పెళ్లయింది. ఆమెను దుల్హన్ బజార్‌కు చెందిన అన్వర్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దర కుమారుల సంతానం కలిగింది. అంతా సవ్యంగా సాగుతుందునుకున్న సమయంలో అదనపు కట్నంపు వేధింపులు పర్వీన్‌కు ఎదురయ్యాయి. సుమారు రెండు సంవత్సరాలుగా తన సోదరిని అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె సోదరుడు సాజిద్ బోరుమన్నాడు. భర్త అన్వర్, ఆయన తల్లిదండ్రులు అంతా కలిసి ఆమెను వేధించారని ఆరోపించాడు.

బుధవారం తెల్లవారు జామున పర్వీన్‌ను చనిపోయినట్టు తనకు సమాచారం అందిందని పర్వీన్ సోదరుడు సాజిద్ చెప్పాడు. వెంటనే తాను సోదరి ఇంటికి వెళ్లాడని వివరించాడు. అక్కడికి వెళ్లి చూడగా తన సోదరి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని ఆవేదనతో చెప్పాడు. అయితే, అంతకు ముందే తన సోదరిని ఆమె భర్త అన్వర్ చంపేశాడని ఆరోపణలు చేశాడు. తన సోదరిని ఫోన్ చార్జర్‌తో గొంతు నులిమి ఆ తర్వాత డెడ్ బాడీని ఫ్యాన్‌కు వేలాడదీశారని పేర్కొన్నాడు. ఫ్యాన్‌కు వేలాడదీసి వారి హత్యను తన సోదరి ఆత్మహత్యగా మలచాలని ప్రయత్నించారని చెప్పాడు.

ఈ విషయం పోలీసులకు తెలియగానే వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. నిందితుడు అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పర్వీన్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు వివరించారు.