Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో దారుణం : ఐదు నిమిషాల తేడాతో మహిళలకు కోవిషీల్డ్, కోవాగ్జిన్..

బీహార్ లో ఓ మహిళకు నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు వేశారు. ప్రస్తుతం ఆమె పరిస్తితి బాగానే ఉందని.. అబ్జర్వేషన్ లో ఉంచి పరిశీలిస్తున్నామన్నారు వైద్యులు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం పట్నా పున్ పున్ బ్లాక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

Bihar woman gets both Covaxin, Covishield shots in 5 minutes, condition stable - bsb
Author
Hyderabad, First Published Jun 19, 2021, 5:09 PM IST

బీహార్ లో ఓ మహిళకు నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు వేశారు. ప్రస్తుతం ఆమె పరిస్తితి బాగానే ఉందని.. అబ్జర్వేషన్ లో ఉంచి పరిశీలిస్తున్నామన్నారు వైద్యులు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం పట్నా పున్ పున్ బ్లాక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

ఆ వివరాలు.. బెల్దారిచెక్ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో జూన్ 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో సునీలా దేవి టీకా వేయించుకోవడానికి వెళ్లింది. ఆరోగ్య సిబ్బంది ఆమెకు కోవిషీల్డ్ డోస్ ఇచ్చారు. ఆ తర్వాత అబ్జర్వేషన్ గదిలోకి వెళ్లి ఐదు నిమిషాల పాటు కూర్చోవాల్సిందిగా సూచించారు. 

ఈ మేరకు సునీలా దేవి వెళ్లి అక్కడ కూర్చుంది. ఇంతలో మరో నర్స్ వచ్చి సునీలా దేవికి కోవాగ్జిన్ టీకా ఇచ్చింది. ఈ సందర్భంగా సునీలాదేవి మాట్లాడుతూ.. ‘నేను వ్యాక్సిన్ తీసుకున్నానని నర్స్ కు చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు. పైగా అంతకుముందు వ్యాక్సిన్ ఇచ్చిన చేతికే మరో టీకా ఇచ్చింది’ అని వాపోయింది. విషయం కాస్త సునీలాదేవి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. 

నిమిషాల వ్యవధిలో ఆమెకు రెండు వేర్వేరు టీకాలు ఇవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడమే కాకుండా.. సునీలాదేవి ఆరోగ్య బాధ్యత వారిదేనని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం వైద్యులు సునీలా దేవిని అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు నర్స్ లను సస్పెండ్ చేయడమే కాక వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios