Asianet News TeluguAsianet News Telugu

'మన సంగతేంటి... బంతి మన కోర్టులో ఉంది': బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్న బీహార్ సీఎం..

జేడీయూ బహిరంగ సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్  బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో బీజేపీని ఓడించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు. 

Bihar Politics Nitish Kumar On Opposition Unity And Narendra Modi Bjp
Author
First Published Dec 12, 2022, 3:42 AM IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నాడు జేడీయూ నిర్వహించిన బహిరంగ సభలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ..  2020 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ.. జేడీయూకు వ్యతిరేకంగానే పని చేసిందని , తమ పార్టీకి సీటు తక్కువ రావడానికి ఇదే కారణమన్నారు.

బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఏకతాటిపైకి వస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘అత్యధిక మెజారిటీ’తో గెలుస్తాయని దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన బంతి .. తన కోర్టులో ఉందని, అయితే.. బీజేపీని వ్యతిరేకించే ఏకతాటిపైకి వస్తే 2024లో వారిని (బీజేపీ) ఓడిస్తామని బీహార్ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. సమాజంలో ఇబ్బందులు సృష్టించాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. తమ పార్టీలో అన్ని కులాలు, మతాల వారున్నారు. మహాకూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.

2020లో బీజేపీ మా అభ్యర్థులను ఓడించింది

2005 లేదా 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీకి గతంలో ఎన్నడూ ఇంత తక్కువ సీట్లు రాలేదని బీజేపీ పేరు చెప్పకుండానే నితీష్ కుమార్ అన్నారు. 2020లో తన పార్టీ అభ్యర్థుల ఓటమిని నిర్ధారించుకోవడానికి వారు ప్రయత్నించినందున తాము నష్టపోయామని అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని,కానీ.. బీజేపీ పట్టుబట్టడంతో ఆ పదవిని స్వీకరించనని నితీష్ కుమార్ మరోసారి చెప్పారు.

కేంద్రం నుంచి బీహార్‌కు ఏమీ అందడం లేదు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి బీహార్‌కు ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను అంగీకరించలేదని వాపోయారు. బ్రిటీష్ పాలన కాలం నుంచి సుభిక్షంగా ఉన్న రాష్ట్రం నుంచి తాను వచ్చానని ప్రధాని మోదీ పేరు చెప్పకుండానే అన్నారు. పేద రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం ముందుకు సాగదని గుర్తు చేశారు.

ప్రచారం కాకుండా పేద రాష్ట్రాల కోసం కేంద్రం పనిచేయడం లేదని ఆరోపించారు. తమ డిమాండ్లను ఆమోదించి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని నితీష్ కుమార్ వాపోయారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న చిరకాల డిమాండ్‌ను కూడా "అన్ని పేద రాష్ట్రాలు పొందాలి" అని ఆయన పేర్కొన్నారు.

 ఈ ఏడాది ఆగస్టులో ఎన్‌డిఎ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత బీహార్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఈ డిమాండ్‌ను లేవనెత్తడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబరులో, బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు కేంద్రంలోని బిజెపిపై నితీష్ కుమార్ విమర్శలు గుప్పించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయం పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఒకే తాటిపై నడువాలని అన్నారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతిపక్ష పార్టీలు విజయం సాధిస్తే బీహార్‌తో సహా అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వస్తుందని ఆయన ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios