Asianet News TeluguAsianet News Telugu

బీహార్‌లో యువతకు ఉపాధి, భద్రత ఎన్డీఏతోనే సాధ్యం: మోడీ

 ఎన్డీఏ మాత్రమే బీహార్ యువతకు భద్రతతో పాటు ఉపాధి అవకాశాలను అందించగలదని  ప్రధాని మోడీ చెప్పారు.
 

bihar people always top priority for values of democracy
Author
New Delhi, First Published Nov 4, 2020, 5:52 PM IST


న్యూఢిల్లీ:  ఎన్డీఏ మాత్రమే బీహార్ యువతకు భద్రతతో పాటు ఉపాధి అవకాశాలను అందించగలదని  ప్రధాని మోడీ చెప్పారు.

బుధవారం సాయంత్రం ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా బీహార్ ఎన్నికల ప్రచారం గురించి ప్రస్తావించారు.ఆధునిక మౌలిక సదుపాయాలపై అపూర్వమైన పెట్టుబడులు... కొత్త ఉపాధి అవకాశాలను తీసుకొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ముద్ర యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం కింద బీహార్ కు లక్ష కోట్ల రూపాయాలు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

सासाराम में पहली रैली से लेकर सहरसा में आखिरी रैली तक जनता ने हमेशा की तरह ढेर सारा प्यार दिया।

एक जनसेवक के रूप में बिहार की भूमि का चरण स्पर्श मुझे जनसेवा के लिए और प्रतिबद्ध करता है।

 

— Narendra Modi (@narendramodi) November 4, 2020

జన్‌ధన్ నుండి ముద్ర లోన్ యోజన వరకు, స్వచ్ఛ భారత్ మిషన్ నుండి ఆయుష్మాన్ భారత్ యోజన వరకు, ఉజ్వలా నుండి జల్ జీవన్ మిషన్ వరకు, బీహార్ అభివృద్ధి ప్రతి దశలో ముఖ్యమైన మైలు రాళ్లను నిర్ధేశించిందని ఆయన చెప్పారు. పురోగతి మార్గంలో వేగవంతమైన దశలు ఆగవని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఇదే విషయంలో బీహార్ ప్రజలు ధృడమైన నిర్ణయం తీసుకొన్నారని ఆయన చెప్పారు.

 

బీహార్ లో జరిగిన ఎన్డీఏ ర్యాలీలలో తాను సాధారణతను చూసినట్టుగా చెప్పారు. యువత, మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందన్నారు. బీహార్ లో ఎన్డీఏ విజయం సాధిస్తే దానికి యువత, మహిళల ఆశీర్వాదమే కారణమౌతోందన్నారు. వీరి ఆశీర్వాదరం మనకు నిరంతరం పనిచేసే శక్తిని ఇస్తోందని చెప్పారు.

బీహార్ యువత, మహిళలు ఎన్డీఏపై ఆశతో చూస్తున్నారని మోడీ అభిప్రాయపడ్డారు.బీహార్ ప్రజలు ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను సుప్రీంగా పరిగణిస్తారన్నారు. అందుకే రాష్ట్రంలో సుపరిపాలన రాజకీయాలను ఇష్టపడుతారని చెప్పారు. 

ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా బీహార్ లోని తన సోదరులు, సోదరీమణులను కలుసుకొని వారి ఆశీర్వాదం పొందే అవకాశం తనకు లభించిందన్నారు.ససారంలో జరిగిన మొదటి ర్యాలీ నుండి సహర్సాలో జరిగిన చివరి ర్యాలీ వరకు ప్రజలు తనకు ప్రేమను పంచారని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

ప్రభుత్వ సేవకుడిగా బీహార్ భూమి స్పర్శ తనను ప్రజా సేవకు మరింత కట్టుబడేలా చేసిందని ఆయన చెప్పారు.రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

మెగా పుడ్ పార్కులు, ఆధునిక కోల్డ్ చైన్స్, ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లతో పాటు ఆధునిక వ్యవసాయ మౌళిక సదుపాయాలను కల్పిస్తాయన్నారు.పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల సంఘాలు చిన్న రైతుల బలాన్ని పెంచుతాయని చెప్పారు. వాటిని పెద్ద మార్కెట్లతో కలుపుతాయని మోడీ హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios