Asianet News TeluguAsianet News Telugu

Bihar:  బీహార్ లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ప‌లువురి ప‌రిస్థితి విషమం 

Bihar: బీహార్‌లోని ఛప్రా జిల్లాలో ఆదివారం భారీ పేలుడు చోటు చేసుకున్నది. ఓ వ్యాపారి ఇంట్లో అక్ర‌మంగా ట‌పాకులు త‌యారు చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘటన జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా... మరో పదిమంది వరకు శిథిలాల కింద‌ చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.

Bihar news Six killed, eight injured in blast firecracker factory in Saran  
Author
Hyderabad, First Published Jul 24, 2022, 6:19 PM IST

Bihar: బీహార్‌లోని ఛప్రా జిల్లాలో ఆదివారం భారీ పేలుడు సంభ‌వించింది.  ఛప్రా జిల్లా ఖోదైబాగ్ గ్రామంలోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ మొత్తంలో బాణాసంచా పేల‌డంతో ఒక్క‌సారి భ‌వ‌నం కూలిపోయింది. ఈ  ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ భవనం శిథిలాల కింద మరో పదిమంది వరకు చిక్కుకొని ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

అక్ర‌మంగా బాణాసంచా తయారు చేస్తున్న స‌మ‌యంలో ఈ పెను ప్ర‌మాదం జ‌రిగింది. ఈఘ‌ట‌న‌లో బాణాసంచా పేలుడు శబ్దాలు దాదాపు గంటకుపైగా వినిపించాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంట‌నే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

జిల్లాలోని ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోదైబాగ్ ప్రాంతంలోని  ఓ వ్యాపారి ఇంట్లో అక్రమంగా పటాకులను త‌యారుచేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం మధ్యాహ్నం ఆ ఇంట్లో అకస్మాత్తుగా భారీ మొత్తంలో  పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇల్లు పూర్తిగా ధ్వంస‌మైంది. మంటల్లో కాలిపోయింది. 

ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఘ‌ట‌న‌లో 6గురు  మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే క్షతగాత్రుల గురించి అధికారిక గణాంకాలేవీ వెల్లడి కాలేదు. క్ష‌త్ర‌గాత్రుల‌ను వెలికి తీయ‌డానికి పోలీసుల‌కు స్థానికులు స‌హయం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సరన్ ఎస్పీ సంతోష్ కుమార్  పరిశీలించారు. బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడుపై ఫోరెన్సిక్ బృందాన్ని దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

దీంతో ఫోరెన్సిక్‌, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ను సైతం రంగంలోకి దిగాయి. ఖైరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖుదాయి బాగ్‌గ్రామంలో షబ్బీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ఇంట్లో బాణాసంచా పేలుడు సంభవించిందని ఎస్పీ పేర్కొన్నారు. బీహార్‌లో ప్ర‌భుత్వ  నిర్లక్ష్యం కారణంగా అనేక జిల్లాల్లో ఇటువంటి పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలు రహస్యంగా నడుస్తున్నాయ‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios