Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో తొలిసారిగా డీఎస్పీగా ఓ ముస్లిం యువతి...

బీహార్.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో కాస్త వెనకబడే ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ అక్షరాస్యత శాతం కూడా తక్కువ. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మహిళల చదువులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే, ముస్లిం కుటుంబాల్లో మహిళల విద్య మీద ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. 

Bihar Muslim girl first from community to become DSP in Bihar Police - bsb
Author
Hyderabad, First Published Jun 11, 2021, 2:42 PM IST

బీహార్.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో కాస్త వెనకబడే ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ అక్షరాస్యత శాతం కూడా తక్కువ. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మహిళల చదువులపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే, ముస్లిం కుటుంబాల్లో మహిళల విద్య మీద ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో ఒక ముస్లిం యువతి గ్రూప్ 1 సర్వీస్ లో అత్యున్నత హోదా అయిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. 

బీహార్లోని గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి చరిత్రను సృష్టించింది.  ఆమె తాజాగా,  ప్రకటించిన బీహార్ పబ్లిక్  సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగానికి ఎంపికైంది.  అయితే బీహార్ రాష్ట్రంలో ఒక ముస్లిం సామాజిక వర్గం నుంచి ఈ సర్వీస్ను సాధించిన తొలి యువతి కూడా  రజియానే. దీంతో ఇప్పుడీమె వార్తల్లో నిలిచింది. కాగా రజియా తో పాటు మరో 40 మంది కూడా డీఎస్పీ సర్వీస్కు ఎంపికయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె హతూవా నగరంలోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తోంది.

రజియా తండ్రి మహమ్మద్ అస్లామ్​ అన్సారీ బొకారోలోని ఒక ఫ్యాక్టరీలో స్టెనోగ్రాఫర్ గా పని చేసేవాడు.  అన్సారీకి ఏడుగురు సంతానం.  వీరిలో రజియా  అందరి కన్నా వయసులో చిన్నది.  ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఆమె ప్రాథమిక విద్యను బొకారోలో, బీటెక్ ను జోధ్ పూర్ లో పూర్తి చేసుకుంది. అయితే రజియా తండ్రి 2016లోనే చనిపోయాడు. దీంతో ఆమె కష్టపడి విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించింది. తన తల్లితో కలిసి ఉంటుంది. ఎలాగైనా ప్రబుత్వ సర్వీస్ సాధించాలనే తపనతో 2017 నుంచి తన ప్రిపరేషన్ ను ప్రారంభించింది. 

ఉద్యోగం చేస్తూనే మిగతా సమయంలో ప్రిపరేషన్ సాగించేది. ఈ క్రమంలో, మొత్తానికి తన కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రజియా మాట్లాడుతూ... ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. మా నాన్నగారికి నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉండేదని తెలిపింది. దీంతో నేను ఆయన కలను, నా ఆశయాన్ని పూర్తి చేశానని తెలిపింది. అయితే, ఇప్పటికీ చాలా చోట్ల మహిళలకు న్యాయం జరగడం లేదని వాపోయింది.

బాధిత మహిళలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. ప్రధానంగా, కొన్ని ముస్లిం కుటుంబాలలోని మహిళలు ఇప్పటికికీ విద్యపట్ల వివక్షతకు గురౌతున్నారని బాధపడింది. అలాంటి కుటుంబాల్లో విద్యపట్ల అవగాహన పెంచుతానని చెప్పింది. అయితే, ఇప్పటికు తాను, కోవిడ్ బారిన పడి కోలుకున్నానని చెప్పింది. ప్రజలంతా వ్యాక్సిన్​ వేయించుకోవాలని దానిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని వివరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios