సదరు ఎమ్మెల్యే మద్యం సేవించి ఉన్నారని.. అండర్ వేర్ తో తిరిగాడని.. తన ఉంగరం కాజేశాడంటూ తోటి ప్రయాణికుడు ఒకరు ఆరోపించడం గమనార్హం.

బిహార్ కి చెందిన ఓ ఎమ్మెల్యే రైలులో అండర్ వేర్ తో తిరుగుతూ.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. సదరు ఎమ్మెల్యే పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా.. తాజాగా ఆ ఎమ్మెల్యేపై మరో కొత్త ఆరోపణలు వచ్చాయి. 

సదరు ఎమ్మెల్యే మద్యం సేవించి ఉన్నారని.. అండర్ వేర్ తో తిరిగాడని.. తన ఉంగరం కాజేశాడంటూ తోటి ప్రయాణికుడు ఒకరు ఆరోపించడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... బిహార్ ఎమ్మెల్యే గోపాల్ పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ వెళ్లే రైలు ఎక్కాడు. అక్కడ ఎమ్మెల్యే గోపాల్ మండల్ రైలులో లోదుస్తులతో తిరిగిన వీడియో వైరల్ అయింది. గురువారం సాయంత్రం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో మండల్ టాయిలెట్‌రూంకు లోదుస్తుల్లో పలుమార్లు వెళ్లడంపై ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 

ఓ ప్రయాణికుడితో మండల్ ఘర్షణ పడాల్సి వచ్చింది. దాంతో, ఈ సంఘటనపై రైల్వే పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీనిపై గోపాల్‌మండల్ వివరణ ఇచ్చారు. రైలులోకి వెళ్లిన తర్వాత తనకు కడుపులో ఇబ్బంది తలెత్తిందని మండల్ తెలిపారు. త్వరగా టాయిలెట్‌రూంకి వెళ్లాల్సి రావడంతో కుర్తా, పైజామా తీసేసి లోదుస్లుల్లోనే వెళ్లాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

తాను అలా వెళ్లడం వల్ల మహిళలు ఇబ్బంది పడ్తారంటూ తోటి ప్రయాణికుడు తనతో గొడవ పడ్డారని, అయితే ఆ సమయంలో తన కంపార్ట్‌మెంట్‌లో మహిళలు ఎవరూ లేరని ఆయన అన్నారు. తాను వివరణ ఇచ్చిన తర్వాత ప్రయాణికుడు కూడా తన తప్పు తెలుసుకున్నారని మండల్ అన్నారు. కాగా, ఈ సంఘటనపై బీహార్‌లోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇలాంటి సంఘటనలతో అధికార పార్టీ బీహార్ ప్రతిష్ఠను దిగజారుస్తున్నదని ఆర్‌జెడి, ఎల్‌జెపి విమర్శించాయి.

కాగా.. తాజాగా.. ఆయన తన ఉంగరం కాజేశాడంటూ తోటి ప్రయాణికుడు ఆరోపించాడు. తన బంగారు ఉంగరం, గొలుసు లాక్కొని అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించాడు. మరి ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.