ఓ మహిళపై సొంత మేనమామ కన్నేశాడు. సదరు మహిళకు పెళ్లై భర్త ఉన్నప్పటికీ.. బెదిరించి మరీ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించాడు. దీంతో మహిళ నోరు విప్పలేదు. అయితే.. ఈ విషయం కాస్త సదరు మహిళ భర్తకు తెలియడంతో నానా రభస చేశాడు. తనకు ఈ భార్య వద్దంటూ.. తాను మళ్లీ ఆమెను స్వీకరించలేనని తేల్చి  చెప్పాడు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిందితుడు కొన్ని నెలలుగా బాధితురాలిపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని కూడా ఆమెను హెచ్చరించాడన్నారు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చిందని వారు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఎనిమిదో నెల అని సమాచారం. కాగా.. ఈ విషయం భర్తకు తెలియడంతో అతడు భార్యతో తెగదెంపులు చేసుకున్నాడు.

 ఆ బిడ్డకు తండ్రో ఎవరో అతడి వద్దే ఉండాలంటూ అతడు భార్యకు తెగేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితురాలు తన మేనమామపై ఫిర్యాదు చేసింది. ఇంట్లోంచి గెంటేశారంటూ తన తాతయ్యపై కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తమపై కేసు పెట్టొద్దని, ఇప్పటికే తాము భర్తకు రెండు లక్షల రూపాయలు పరిహారం కింద ఇచ్చామని నిందితులు పోలీసులను వేడుకున్నట్లు తెలుస్తోంది.