ప్రత్యర్థులు కాల్పులు జరిపితే  తీవ్ర గాయాలపాలైనా తన కూతురును పరీక్ష కేంద్రానికి చేర్చాడు ఓ తండ్రి. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

న్యూఢిల్లీ: ప్రత్యర్థులు కాల్పులు జరిపితే తీవ్ర గాయాలపాలైనా తన కూతురును పరీక్ష కేంద్రానికి చేర్చాడు ఓ తండ్రి. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

బీహార్ రాష్ట్రంలోని బేగుసరాయ్‌ జిల్లాలో రాష్ట్రీయ జనతాదళ్ కు చెందిన రాంక్రిపాల్ మహతో గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన కూతురు పదో తరగతి పరీక్షలను రాసేందుకు కారులతో బేగుసరాయ్ పట్టణానికి బయలు దేరాడు.

పరీక్ష కేంద్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆరుగురు సాయుధులు రాంక్రిపాల్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తన శరీరంలోని బుల్లెట్‌ దిగి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా కూతురిని పరీక్షా కేంద్రంలో వదిలాడు.

అనంతరం స్థానికుల సహకారంతో రాంక్రిపాల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పాతకక్షలతోనే రాంక్రిపాల్‌పై ప్రత్యర్థులు కాల్పులకు దిగినట్టుగా గుర్తించారు.