నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు  చేయనున్నారు. డిసెంబర్ 16వ తేదీన ఉదయం 5గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా... ఈ మేరకు తీహారు జైలులోని ఫాన్సీ కోటలో ఉరిశిక్ష విధించే కంట్రీయార్డును అధికారులు పరిశీలించారు.

నిర్భయ హత్యాచారం కేసులో దోషులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ,  అక్షయ్ కుమార్ సింగ్ లకు ఉరివేసేందుకు ఇప్పటికే తాళ్లు సిద్ధం చేశారు. ఇటీవలే తలారీ కూడా దొరికేశాడు. కాగా... వీరి ఉరి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

1950వ సంవత్సరంలో నిర్మించిన రెండు కాంక్రీట్ పిల్లర్లకు మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేసి ఉంది. మెటల్ బార్ నలుగురు దోషుల బరువు ఆపుతుందా లేదా ఇదేమైనా తుప్పు పట్టిందా అని అధికారులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే ఉరి కొయ్యలు అమర్చేందుకు వీలుగా అదనంగా మరో మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

AlsoRead నా కూతురు పేగులు బయటకు లాగారు.. అప్పుడు ఏమయ్యాయి ఈ మానవ హక్కులు.. నిర్భయ తల్లి...
 
బీహార్ రాష్ట్రంలోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి తెప్పిస్తున్న 8 మనీలా ఉరితాళ్లు మృదువుగా, బలంగా ఉండేలా వీటికి దూదిని కలిపారు. ఉరి తీయబోయే దోషులు తక్కువ నొప్పితో ప్రాణాలు విడిచేందుకు వీలుగా ఉరితాళ్లకు గ్రీజులాగా వెన్న పూయాలని తీహార్ జైలు అధికారులు నిర్ణయించారు. 

నిర్భయ దోషుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని, వారు ప్రతీరోజూ వారు న్యాయవాదులను కలుస్తూ వారి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తీహార్ జైలు అధికారులు చెప్పారు. జైలు నిబంధనల ప్రకారం నిర్భయ దోషులకు 15 రోజులకు ఒకసారి వారు కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతిస్తున్నామని తీహార్ జైలు అధికారులు వివరించారు.