బీహార్ లోని గయాలో ఓ మైనర్‌ని బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు.. కేకలు రావడంతో కదులుతున్న ఆటోలోంచి బయటకు తోసేవేశారు. తీవ్ర గాయాలతో ఆ బాలిక మృతి చెందింది.

మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలను తీసుకు వచ్చినా కూడా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. అత్యాచారాలు, హత్యలు,మోసాలు, కిడ్నాప్ లు ఇలా నిత్యం వారు ఏదోక రకంగా వేధింపులకు గురవుతున్నారు. ఇటీవల కామాంధులు మరింత రెచ్చిపోయారు. తమ కామ కోరికలను తీర్చుకోవడానికి కంటికి కనిపించిన ఆడ పిల్లను అపరిహరించి.. లైంగిక దాడి చేసి, చివరికి అత్యంత కీరాతకంగా చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఉద్దంతమే వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక ను ఆటోలో అపహారించేందుకు కొందరూ కామాంధులు ప్రయత్నం చేశారు. కానీ, ఆ బాలిక అరుపులు, కేకలు వేయడంతో ఆ బాలికను రన్నింగ్ ఆటోలో నుంచి తోసివేశారు. తీవ్రంగా గాయపడినా ఆ చిన్నారి మృతి చెందింది. ఆ దుండగులు గ్రామస్తులకు దొరకడంతో దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది..


వివరాల్లోకెళ్తే.. గయా జిల్లాలో ని టంకుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని గయా-రాజౌలి రహదారి పై ఇద్దరు వ్యక్తులు 15 ఏళ్ల బాలికను ఆటోలో అపహరించారు. దీంతో ఆ బాలిక అరుపులు, కేకలు వేయడంతో ప్రారంభించింది. బాలిక అరుపులు విన్న స్థానికులు ఆటోను వెంబడించారు. దీంతో భయపడిన దుండగులు బాలికను కదులుతున్న ఆటోలో నుంచి తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారిని మగద్ మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ.. చిక్సిత పొందుతూ మృతి చెందింది. అయితే స్థానికులు వారిని వెంబడించి డ్రైవర్‌ను పట్టుకున్నారని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో పోలీసులు చర్యలు తీసుకుంటుండగా.. ఆ ఆటో డ్రైవర్‌ను పట్టుకున్నారు. అరెస్టయిన ఆటో డ్రైవర్ పేరు పింటూ అని చెబుతున్నారు. అయితే, ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. అలాగే పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నారు. దుండగులు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన బాలిక ఎవరనేది ఇంకా నిర్ధారించబడలేదు. బాలికను రక్షించే శబ్ధం విని తాము ఆమెను వెంబడించామని గ్రామస్థులు తెలిపారు. తిరిగి వస్తున్న వారిని చూసి నేరస్తులు మైనర్‌ను ఆటోలో నుంచి తోసేసి పరారయ్యారు. అయితే ఆటో డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించామని స్థానికులు తెలిపారు. 

ఈ ఘటనపై పోలీసులు సమాచారం ఇస్తూ గయా-ఫతేపూర్ రోడ్డులోని తనకుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్ పింటూను విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లు గయా ఎస్‌ఎస్పీ ఆశిష్ భారతి తెలిపారు. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఆటో డ్రైవర్ పింటూ కుమార్‌ను విచారిస్తున్నారు. ఇతను టంకుప్ప బర్తర గ్రామ నివాసి. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తుమని తెలిపారు.