4 చేతులు, కాళ్ళతో జన్మించిన చిన్నారి ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోను సోనూసూద్ ట్విట్టర్‌లోకి షేర్ చేయడంతో ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది.
సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఆయన సేవలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత కూడా ఎవరికి ఏ సాయం కావాలని అడిగినా లేదనకుండా చేస్తున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, సాయం కావాల్సి ఉందని తెలిసినా స్వచ్ఛందంగా ముందుకువచ్చి తనవంతు సాయం చేస్తూనే ఉన్నారు. అలా బీహార్ కు చెందిన ఓ చిన్నారికి 4 కాళ్లు, చేతులు ఉన్నాయి. దీంతో అమ్మాయికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి.. ఇది తెలిసిన రియల్ హీరో వెంటనే స్పందించారు.
బాలికకు చికిత్స అందించేందుకు సాయం చేశారు. చికిత్స చేయిస్తున్న ఫోటోను సోనూ సూద్ ఇంటర్నెట్ లో షేర్ చేశారు. దీని గురించి చెబుతూ.. మీరు ఇటీవల ఇంటర్నెట్‌లో బీహార్‌కు చెందిన నాలుగు చేతులు, కాళ్ళతో జన్మించిన ఒక చిన్న అమ్మాయి వీడియోను చూసి ఉంటారు. ఆ అమ్మాయి నవాడా జిల్లాలో జన్మించింది. ఆమె కోలుకోవడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి వెంటనే శస్త్రచికిత్స చేయవలసి ఉంది. ఇప్పుడు, నటుడు సోనూ సూద్ ముందుకొచ్చి ఆ చిన్నారికి సహాయం అందించాడు... అని ఆ పోస్టును షేర్ చేస్తున్నారు.
చిన్నారికి జరుగుతున్న ఆపరేషన్‌కు సంబంధించిన చిత్రాన్ని సోనూ సూద్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. “టెన్షన్ పడకండి, చికిత్స మొదలయ్యింది. అంతా బాగానే జరగాలని దేవుడిని ప్రారంభించండి” అని క్యాప్షన్ రాశారు. ఈ ట్వీట్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోనూ సూద్ తన దాతృత్వ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందాడు. తన స్వంత ఖర్చుతో అనేక మందికి కనీస సౌకర్యాలు, వైద్య ఖర్చుల కోసం డబ్బు సహాయం చేశాడు. అతను చేస్తున్న సామాజిక సేవతో అనేకమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేకాదు ఇటీవల బీహార్‌కు చెందిన బాలిక ఒంటి కాలుతో పాఠశాలకు వెళ్లే వీడియో వైరల్‌గా మారింది. దీనిమీద కూడా సోనూసూద్ స్పందించారు.
