వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 100మంది చిన్నారులు కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన బిహార్ రాష్ట్రంలో  చోటుచేసుకుంది. ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల బిహార్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో కొంత మంది చిన్నారులు మోదడు వ్యాపు వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. కాగా... కేవలం 16 రోజుల్లో దీని కారణంగా 100మంది చిన్నారులు మృతి చెందారు.

ఇందులో ఒక్క శ్రీకృష్ణ మెడికల్ కాలేజీలోనే 83 మంది మరణించారు. కేజ్రీవాల్ ఆసుపత్రిలో మరో 17 మంది చిన్నారులు మృతి చెందారు. అంతే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
 
16 రోజుల నుంచి చిన్నారులు మెదడువాపు వ్యాధితో చనిపోతున్నారు. ఇప్పటి వరకు 300 మంది చాన్నారులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌(ఐసీయూ)లో చేరినట్లు ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి. చిన్నారులకు సరైన చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్యం వహిస్తున్నారని...అందుకే వారు మృత్యువాత పడుతున్నారని బాధితులు చెబుతున్నారు
 
మెదడు వాపు వ్యాధి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ ఎస్‌కే షాహి తెలిపారు. అక్యూట్ ఎన్‌సిఫలైటిస్ సిండ్రోమ్‌కు అధిక ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండడమే కారణమని వెల్లడించారు. వర్షాలు పడితే పరిస్థితిలో మార్పు వస్తుందని, మరణాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు.