బిజెపి పార్టీ ఎంపీగా కొనసాగుతూ...అదే పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన బాలీవుడ్ నటుడు, ఎంపీ శతృఘ్న సిన్హాపై బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ నిర్ణయాలు, విధానాలు నచ్చకపోతే పార్టీని వీడవచ్చని సలహా ఇచ్చారు. కానీ బిజెపి ఎంపిగా కొనసాగుతూ తమ పార్టీ తరపున దేశంలో అత్యున్నత ప్రధాని పదవిలో వున్న నరేంద్ర మోదీని విమర్శించడం తగదని శతృహ సిన్హాకు హితవు పలికారు.  

మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ప్రోద్బలంతోనే శతృఘ్న సిన్హా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని మోదీ సంచనల వ్యాక్యలు చేశారు. వీరి వల్ల పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. పార్టీని బలహీనపర్చే ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని గట్టిగా హెచ్చరించారు.

శతృఘ్న సిన్హా తన బలంతోనే పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచానని  భ్రమ పడుతున్నాడని ఎద్దేవా చేశారు. కానీ స్థానిక బీజేపీ నేతలు నంద్ కిషోరి యాదవ్, సంజీవ్ చౌరాసియా, అరుణ్ కుమార్ సిన్హా, నితిన్ నవీన్ లతో పాటు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల కృషి వల్లే గెలిచాడని గుర్తుచుకోవాలన్నారు. ఈ సారి శతృఘ్న సిన్హా పార్టీ మారితే పాట్నా సాహిబ్  నుంచి పోటీకి తాను సిద్దంగా వున్నట్లు మోదీ వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలపై, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రధానిపై విమర్శలు చేసినా బిజెపా పార్టీ అన్ని క్షమించిందని పేర్కొన్నారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, మరో రెండు సార్లు లోక్ సభ సభ్యుడిగా, ఒకసారి కేంద్ర మంత్రిగా అవకాశమిచ్చిన పార్టీకి ద్రోహం చేసేలా వ్యవహరించడం తగదని శతృఘ్న సిన్హాను సుశీల్ కుమార్ మోదీ సూచించారు.