Asianet News TeluguAsianet News Telugu

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను.. నితీష్ కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ పార్లమెంటరీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయ‌నున్నార‌నే ఊహాగానాలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు.  

Bihar CM Nitish Kumar says Not interested in contesting Lok Sabha elections from UP's Phoolpur
Author
First Published Sep 20, 2022, 11:16 PM IST

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యూపీలోని ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  పోటీ చేస్తార‌న‌నే వార్త‌లు కొద్ది రోజులుగా పొలిటికల్ కారిడార్‌లో చర్చ జరుగుతోంది. అయితే.. ఆ వార్త‌ల‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తోసిపుచ్చారు. 

నితీష్ కుమార్ మీడియాతో మ‌ట్లాడుతూ.. తన మనసులో ఏముందో చెప్పారు. ఆ ప్రశ్నకు ఆయ‌నే  స్వయంగా సమాధానమిచ్చారు. ఈ విషయాలన్నీ నితీష్ తోసిపుచ్చుతూ..  2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు విప‌క్షాల పార్టీలను ఎలా ఏకం చేయాల‌నే ఆస‌క్తి ఉంద‌నీ, ఆ విష‌యంలో దృష్టి కేంద్రీక‌రించాన‌ని, పార్ల‌మెంట్ ఎన్నికల్లో పోటీ ప‌ట్ల త‌న‌కు ఆస‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. విప‌క్ష‌ పార్టీలు ఐక్యంగా ఉంటేనే 2024లో విజయం సాధిస్తామని తెలిపారు. యూపీలో ఏ స్ధానం నుంచి పోటీ చేసినా అఖిలేష్ యాద‌వ్ కు తాము మ‌ద్ద‌తిస్తామ‌ని తెలిపారు.  పూల్పూర్ నుంచి నితీష్ కుమార్ పోటీ చేయాల‌ని, ఆ నియోజ‌క‌వర్గానికి చెందిన జేడీ(యూ) శ్రేణులు నితీష్‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

ఎవరు ఏం మాట్లాడినా..స్థానిక ప్రజలు త‌న‌కు మద్దతు ఇస్తార‌ని అన్నారు. ప‌రోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తూ..  దేశంలో వివాదాలు సృష్టించి.. తమ దారి తాము చూసుకోవడమే.. కొంత మంది వ్యక్తుల పరిస్థితి అని బీజేపీని ఉద్దేశించి సీఎం అన్నారు.  హిందూ-ముస్లింల మధ్య గొడవలు పెట్టి తమ పని ఎలా చేసుకోవాలో ప్ర‌జ‌ల‌కు తెలుసునని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

రాజకీయాల్లో కొత్త తరం ముందుకు సాగాలని తన కోరిక అని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.  సిఎం డిప్యూటీ ముఖ్యమంత్రి తేజాష్వి ప్రసాద్ యాదవ్ తనతో నిలబడి, ప్రజల స‌మ‌స్య‌ల‌ను వెంబడించాలని అన్నారు. రాజ‌కీయాల్లో న‌వ‌త‌రం ముందుకు సాగాలనీ, వారి కోసం పని చేయాలని అన్నారు. 

ఇదిలా ఉంటే.. పూల్పూర్ స‌హా మిర్జాపూర్‌, అంబేద్క‌ర్ న‌గ‌ర్ నియోజ‌క‌వర్గాల నుంచి ఎంపీ అభ్య‌ర్ధిగా బ‌రిలో నిల‌వాల‌ని నితీష్ కుమార్‌కు ఎస్పీ ఆఫ‌ర్ చేసిన‌ట్టు జేడీ(యూ) జాతీయ అధ్య‌క్షుడు లాల‌న్ సింగ్ పేర్కొన‌డం ఈ ఊహాగానాల‌కు మ‌రింత బ‌ల‌మిచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios