Asianet News TeluguAsianet News Telugu

బీహార్ సీఎం నితీశ్ కుమార్ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. టేకాఫ్ అయిన కాసేపటికే

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రతికూల వాతావరణం కారణంగా.. ముఖ్యమంత్రి చాపర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలట్లు. ప్రస్తుతం గయాలో సీఎం నితీశ్ కుమార్ క్షేమంగా వున్నారని బీహార్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

bihar cm Nitish Kumar's helicopter makes emergency landing
Author
Patna, First Published Aug 19, 2022, 6:39 PM IST

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాజధాని పాట్నా నుంచి రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలను సందర్శించేందుకు సీఎం హెలికాఫ్టర్‌లో బయల్దేరారు. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే ప్రతికూల వాతావరణం కారణంగా.. ముఖ్యమంత్రి చాపర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలట్లు. ప్రస్తుతం గయాలో సీఎం నితీశ్ కుమార్ క్షేమంగా వున్నారని బీహార్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఇకపోతే.. బీహార్‌లోని పలు జిల్లాలు తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్నాయి. వర్షం కోసం ఆయా జిల్లాల ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇటీవల లోక్‌సభలో బీజేపీ ఎంపీ రామ్‌కృపాల్ యాదవ్ ఆ అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. పరిస్ధితిని అంచనా వేసేందుకు బీహార్‌కు రావాలని రామ్‌కృపాల్ యాదవ్ కోరారు. అంతేకాకుండా సీఎం నితీశ్ కుమార్ కూడా పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios