బీహార్ సీఎం నితీష్ కుమార్  మంగళవారం నాడు రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ తో  నితీష్ కుమార్ భేటీ అయ్యారు. 

పాట్నా: Bihar CM సీఎం నితీష్ కుమార్ మంగళవారం నాడు మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. సీఎం Nitish Kumar వెంట RJD నేత Tejashwi Yadav కూడా ఉన్నారు. బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందించారు. రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం నితీష్ కుమార్ గవర్నర్ పాగు చౌహాన్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. బీజేపీతో పొత్తుకు స్వస్తి పలికి ఆర్జేడీ తో నితీష్ కుమార్ పెట్టుకోనున్నారు. దీంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. జేడీ యూ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పార్లమెంటరీ పార్టీ నేత ఉపేంద్ర కుష్వాహా సీఎం నితీష్ కుమార్ ను అభినందించారు. కొత్త కూటమికి నాయకత్వం వహిస్తున్నందుకు అభినందనులు తెలుపుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.నితీష్ జీ ముందుకు సాగండి, దేశం మీ కోసం వేది ఉందని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత రాజ్ భవన్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించినట్టుగా నితీష్ కుమార్ మీడియాకు చెప్పారు.

ఇవాళ ఉదయం ఆర్జేడీ, జేడీ యూ పార్టీ ప్రజా ప్రతినిధులు వేర్వేరుగా సమావేశమయ్యారు. నితీష్ కుమార్ నివాసంలో జేడీ యూ నేతలు సమావేశమయ్యారు. రబ్రీదేవి నివాసంలో ఆర్జేడీ నేతలు సమావేశమయ్యారు. తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో బీజేపీతో చెలిమికి స్వస్థి పలుకుతున్నట్టుగా నితీష్ కుమార్ ప్రకటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరో వైపు నితీష్ కుమార్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆర్జేడీ కూడా సిద్దమనే సంకేతాలు కూడా ఇచ్చింది.

బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు నితీష్ కుమార్ ప్రయత్నాలు ప్రారంభించారు. భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు నితీష్ కుమార్ . నితీష్ కుమార్ కు ఆర్జేడీ మద్దతుగా గవర్నర్ కు లేఖలు సమర్పించనున్నారు.