బిహార్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్ పిల్లలను మోసుకెళ్లుతున్న పడవ మునక, 12 మంది గల్లంతు

బిహార్‌లో స్కూల్‌కు వెళ్లే పిల్లలను మోసుకెళ్లుతున్న పడవ మునిగిపోయింది. దీంతో 12 మంది గల్లంతయ్యారు. 34 మంది వెళ్లుతున్న ఆ పడవ మునిగిపోవడంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లోకి దిగాయి. ఇప్పటి వరకు సుమారు 20 మందిని కాపాడినట్టు సమాచారం.
 

bihar boat capsizes over dozen school going children missing in muzaffarpurs bagmati river kms

పాట్నా: బిహార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 34 మంది స్కూల్‌కు వెళ్లుతున్న పిల్లలు మోసుకెళ్లుతున్న పడవ మునిగిపోయింది. 12 మంది పిల్లలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కనిపించడం లేదు. నీట మునిగిపోయారా? అనే భయాలు ఉన్నాయి. ఈ ఘటన ఈ రోజు (గురువారం) ఉదయం చోటుచేసుకుంది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.

స్కూల్‌కు వెళ్లే పిల్లలు బాగమతి నది దాటి వెళ్లాల్సి ఉన్నది. వారు చిన్న పడవలో ఆ నది దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే స్పాట్‌కు వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయ బృందాలకు వారు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే స్పాట్‌కు వచ్చి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి.

Also Read: ఫ్లైట్‌లో టాయిలెట్‌లో శృంగారం.. డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికులు షాక్.. వీడియో వైరల్

ఇప్పటి వరకు సుమారు 20 మంది పిల్లలను రక్షించినట్టు జాతీయ మీడియా తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios