బిహార్ లోని ఈస్ట్ చంపారన్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం చేస్తుండగా బాయిలర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... శనివారం ఉదయం కొందరు కార్మికులు ఓ ఎన్జీవో సంస్థకు చెందిన కమ్యూనిటీ కిచెన్‌లో మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడికక్కడే నలుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 గాయపడిన వారిని సమీపంలోని సుగౌలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను ముజఫర్పూర్ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. కాగా  ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.