Asianet News TeluguAsianet News Telugu

ఇండియాపై కరోనా పంజా: 24 గంటల్లో 8,380 కేసులు, మొత్తం 1.8లక్షలకు చేరిక

దేశంలో 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఒక్క రోజులోనే 8,380 కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో దేశంలోని 1.82 లక్షలుగా నమోదయ్యాయి.
 

Biggest 1-Day Jump Of 8,380 Coronavirus Patients Takes Total To 1.8 Lakh
Author
New Delhi, First Published May 31, 2020, 10:46 AM IST

న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఒక్క రోజులోనే 8,380 కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో దేశంలోని 1.82 లక్షలుగా నమోదయ్యాయి.

కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం కరోనా కేసులపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 193 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఒక్క రోజులోనే దేశంలో 8 వేల మార్క్ ను దాటడం ఇదే ప్రథమం. కరోనా కేసుల్లో గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున  కరోనా కేసులు నమోదౌతున్నాయి.

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశంలో లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ కేసుల పెరుగుదలతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కేసులను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. 

దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఈ నగరాల్లో కరోనా కేసుల తీవ్రతను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios