ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఓ బాణాసంచా ప్యాక్టరీలో ప్రమాదవశాత్తు భారీ ఎత్తున పేలుడు జరగింది. ఈ ప్రమాదంలో చిక్కుకుని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దుర్ఘటన బుద్వాన్ జిల్లాలో చోటుచేసుకుంది. మరో పదిరోజుల్లో దీపావళి పండగ ఉండటంతో ఓ ప్యక్టరీలో భారీ ఎత్తున టపాసుల తయారీ జరుగుతోంది. అయితే ఇవాళ మద్యాహ్నం ప్రమాదవశాత్తు మందుగుండు సామాగ్రికి మంటలు అంటుకుని ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఒక్కసారిగా పేటుడు సంభవించడంతో అక్కడ పనిచేస్తున్నఏడుగురు కార్మికులు మంటల్లో సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ పేలుళ్ల ప్యాక్టరీ సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో పాటు పరిసరప్రాంతాల్లో ద‌ట్ట‌మైన పొగ అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ప్యాక్టరీకి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.  

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంటల్ని అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి  చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.