జో బిడెన్ కు స్వాగతం పలుకుతున్న వేళ.. విమానాశ్రయంలో సందడి చేసిన చిన్నారి.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?
జీ20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. బిడెన్‌కు స్వాగతం పలికే సమయంలో విమానాశ్రయంలో ఓ చిన్నారి అందరీ దృష్టిని ఆకర్షించాయి. అమెరికా అధ్యక్షుడు కూడా ఆ అమ్మాయి స్వాగతం పలికినప్పుడు హృదయాన్ని హత్తుకుని, అప్యాయంగా మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు?

న్యూఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చారు. పాలం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయనకు సాదర ఆహ్వానం పలికేందుకు కేంద్ర మంత్రి వీకే సింగ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కూడా పాల్గొన్నారు. అందరూ జో బిడెన్‌కి ముకుళిత హస్తాలతో స్వాగతం పలికారు. జో బిడెన్ కూడా అందరి శుభాకాంక్షలను ఆప్యాయంగా స్వీకరించారు. ఈ క్రమంలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. అందరి దృష్టి జో బిడెన్‌పైనా ఉంటే.. జో బిడెన్ మాత్రం ఆ చిన్నారితో అప్యాయంగా మాట్లాడుతూ.. హృదయాన్ని హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వెంటనే ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
ఇంతకీ ఆ చిన్నారి ఎవరూ? ఆ చిన్నారితో అమెరికా అధ్యక్షుడు అంతా అప్యాయంగా ఎందుకు మాట్లాడారు? అనే పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఆ చిన్నారి గురించి ఆరా తీసున్నారు. ఈ చిన్నారి మరెవరో కాదు. భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కుమార్తె మాయ. మాయ గార్సెట్టి.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దిగిన వెంటనే స్వాగతం పలికారు. చాలా సంతోషంగా కనిపించారు. విశేషమేమిటంటే స్వయంగా జో బిడెన్ కూడా మాయతో మాట్లాడి మాయను కౌగిలించుకున్నాడు. విమానాశ్రయంలో మాయ, జో బిడెన్‌ల ఈ చిత్రాలను చూసిన ప్రజలు చాలా సంతోషించారు. మాయా గార్సెట్టి తన తండ్రి అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టితో కలిసి జో బిడెన్‌కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది.
గతంలోనూ వార్తల్లో నిలిచిన మాయ
మాయా గార్సియా వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఎరిక్ గార్సెట్టి భారతదేశంలోని యుఎస్ రాయబారిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా మాయ ఫోటో వైరల్ అయ్యింది. ఆ ఐకానిక్ ఫోటోలో ఆ చిన్నారి హీబ్రూ బైబిల్‌ను పట్టుకుని కనిపించింది, అదే బైబిల్‌పై గార్సెట్టి తన ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమైన క్షణం. ఈ వేడుకలో ఎరిక్ భార్యతో సహా కుటుంబం మొత్తం పాల్గొన్నారు.
ఎరిక్ గార్సెట్టి ఎవరు?
ఎరిక్ గార్సెట్టి ప్రస్తుతం న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీకి యుఎస్ రాయబారిగా పనిచేస్తున్నారు. అతను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రోడ్స్ స్కాలర్ , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నాడు. అతను యునైటెడ్ స్టేట్స్ నేవీ రిజర్వ్‌లో అధికారిగా కూడా పనిచేశాడు. ఎరిక్ గార్సెట్టి జూలై 2013 నుండి డిసెంబర్ 2022 వరకు లాస్ ఏంజిల్స్ 42వ మేయర్‌గా ఉన్నారు. ఆయన దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్‌కు మొదటి యూదు మేయర్‌గా నియమితుడయ్యాడు.