ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు భూటాన్ రాజు
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చక్ ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొన్నారు. ఆయనకు స్వయంగా సీఎం యోగి సాదరస్వాగతం పలికారు.

Kumbhmela 2025 : భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చక్ మంగళవారం సీఎం యోగితో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. భూటాన్ రాజు సోమవారం లక్నో చేరుకున్నారు. అక్కడ సీఎం యోగి ఆయనకు స్వాగతం పలికారు. మంగళవారం ఇద్దరూ ప్రయాగరాజ్ చేరుకొని సంగమ స్నానం చేశారు. సంగమ స్నానం తర్వాత అక్షయ వట, హనుమాన్ మందిరాలను దర్శించారు. ఇద్దరు నాయకులు డిజిటల్ మహా కుంభ అనుభూతి కేంద్రాన్ని కూడా సందర్శించారు.
'మహా కుంభ 2025'లో స్నానం కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భూటాన్ రాజు కూడా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో పుణ్య స్నానం చేసేందుకు ప్రయాగరాజ్ వచ్చారు. సీఎం యోగి ఆయనకు త్రివేణి సంగమంలో స్నానం, పూజలు చేయించారు.
జిగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చక్ సోమవారం థింపు నుంచి లక్నో చేరుకున్నారు. అక్కడ సీఎం యోగి ఆయనకు స్వాగతం పలికారు. సంగమ స్నానం తర్వాత భూటాన్ రాజు, సీఎం యోగి అక్షయ వట, హనుమాన్ మందిరాలను దర్శించారు. తర్వాత డిజిటల్ మహా కుంభ అనుభూతి కేంద్రాన్ని సందర్శించి మహా కుంభ డిజిటల్ రూపాన్ని వీక్షించారు. భూటాన్ రాజు పర్యటన భారత్-భూటాన్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.
భూటాన్ రాజు ఆధ్యాత్మిక యాత్రలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు స్వతంత్ర దేవ్ సింగ్, నంద గోపాల్ గుప్తా 'నంది', విష్ణుస్వామి సంప్రదాయ సతువా బాబా పీఠం మహంత్ జగద్గురు సంతోష్ దాస్ (సతువా బాబా) తదితరులు పాల్గొన్నారు.

