Asianet News TeluguAsianet News Telugu

భూపేష్ బాఘేల్ నన్ను దుబాయ్ వెళ్లమని సలహా ఇచ్చాడు.. శుభమ్ సోనీ వీడియో వైరల్..

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్‌కు మనీలాండరింగ్, అక్రమ నిధుల వినియోగం వంటి ఆరోపణలకు సంబంధించి ఓ సంచలన వీడియో వెలుగు చూసింది. 

Bhupesh Baghel advised me to go to Dubai, Shubham Soni video viral   - bsb
Author
First Published Nov 6, 2023, 7:16 AM IST

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తనను యూఏఈకి వెళ్లమని సూచించారని మహదేవ్ యాప్ కేసులో నిందితుడు పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రిపై ఈ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆయనపై మనీలాండరింగ్, అక్రమ నిధుల వినియోగం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ బలంగా ఉంది. 

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెతుకుతున్న నిందితుడు శుభమ్ సోనీ ఈరోజు దుబాయ్ నుండి ఓ  వీడియోను రూపొందించి విడుదల చేసినట్లు వర్గాలు తెలిపాయి. బాగెల్‌పై ఈ వీడియోలో అనేక తీవ్రమైన ఆరోపణలను చేశాడు సోనీ. బాగెల్ సలహా మేరకే తాను దుబాయ్ కి వెళ్లినట్లు సోనీ వీడియోలో పేర్కొన్నారు.

Amit Shah: వారి సంఖ్యను ఉద్దేశపూర్వకంగానే పెంచారు.. కులాల సర్వేపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

భారీ లాభాలతో సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల స్కానర్ కింద వచ్చిన బెట్టింగ్ యాప్ మహాదేవ్‌కి తానే నిజమైన యజమాని అని కూడా అతను పేర్కొన్నాడు.

ఇటీవల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అసిమ్ దాస్ అనే కొరియర్ నుండి రూ.5.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఏజెన్సీ ప్రకారం, భూపేష్ బఘేల్ కోసం దుబాయ్ నుండి శుభమ్ సోనీ దానిని పంపినట్లు వ్యక్తి పేర్కొన్నాడు. బెట్టింగ్ యాప్‌తో అనుసంధానించబడిన కొన్ని బినామీ బ్యాంకు ఖాతాలు కూడా కనిపెట్టారు. వాటిలో ఉన్న రూ. 15.59 కోట్లు స్తంభింపజేశారు.

అసిమ్ దాస్‌ను విచారించిన తర్వాత, అతని సెల్‌ఫోన్, శుభమ్ సోనీ పంపిన ఇ-మెయిల్  ఫోరెన్సిక్ పరీక్షలో, “గతంలో సాధారణ చెల్లింపులు జరిగాయి. ఇప్పటివరకు సుమారు రూ. 508 కోట్లను మహాదేవ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కు చెల్లించారు" అని వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios