Asianet News TeluguAsianet News Telugu

మరో దారుణం.. మైనర్ బాలికపై పోలీసు క్వార్టర్స్ లోనే...


అదే సమయంలో అటుగా వచ్చిన కామాంధుల కళ్లు ఆమెపై పడ్డాయి. కారులో వచ్చిన సస్పెండైన కానిస్టేబుల్ జితేంద్ర సేథీ.. ఆమెకు లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆ సమయంలో అమ్మాయికి తాను కానిస్టేబుల్‌నంటూ ఐడీ కార్డ్ కూడా చూపించాడు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా కారులో ఉన్నారు. వారి మాయమాటలు నమ్మిన ఆ అమ్మాయి కారు ఎక్కింది. 

Bhubaneshwar: Suspended cop rapes minor girl
Author
Hyderabad, First Published Dec 4, 2019, 8:10 AM IST

హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటనను ఇంకా ప్రజలు మరవనేలేదు. అప్పుడే మళ్లీ  అలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులు మైనర్ బాలిక విషయంలో భక్షకులుగా మారారు. ఈ సంఘటన  ఒడిశాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... గతంలోనే సస్పెన్షన్‌కి గురైన ఓ పోలీసు కానిస్టేబుల్ మరో ఇద్దరు దుర్మార్గులు కలిసి ఓ మైనర్ బాలికకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి తీసుకెళ్లి పూరీలోని పోలీస్ క్వార్టర్స్‌లోనే సామూహిక అత్యాచారం చేశారు. భువనేశ్వర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బస్సులో ఇంటికి వెళ్లే క్రమంలో మార్గం మధ్యలో నిమాపారా వద్ద దిగింది. స్నాక్స్ తీసుకునేలోపు బస్సు వెళ్లిపోవడంతో మరో బస్సు కోసం ఎదురుచూస్తోంది. 

అదే సమయంలో అటుగా వచ్చిన కామాంధుల కళ్లు ఆమెపై పడ్డాయి. కారులో వచ్చిన సస్పెండైన కానిస్టేబుల్ జితేంద్ర సేథీ.. ఆమెకు లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆ సమయంలో అమ్మాయికి తాను కానిస్టేబుల్‌నంటూ ఐడీ కార్డ్ కూడా చూపించాడు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా కారులో ఉన్నారు. వారి మాయమాటలు నమ్మిన ఆ అమ్మాయి కారు ఎక్కింది. 

ఆ తర్వాత ఆమె నోరు నొక్కేసి పోలీస్ క్వార్టర్స్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.  ఆమెను ఆ క్వార్టర్‌లోనే ఉంచి తాళం వేసి బయటకు వెళ్లిపోయారు. అయితే, బాధితురాలి అరుపులు విని ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను రక్షించారు.

కాగా... వాళ్లు ఘాతుకానికి పాల్పడుతున్నప్పటికీ.. బాలిక వాళ్లను సెల్ ఫోన్ లో చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అలా బాధితురాలు తన సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించిన ఫుటేజీనే ఇప్పుడు కేసు విచారణలో కీలకంగా మారింది. అంతే కాదు.. ఏ పోలీస్ ఐడీ కార్డుతో తనకు నమ్మ కం కలిగేలా జితేంద్ర సేథీ ప్రయత్నించాడో.. అదే ఐడీ కార్డును ఆమె గట్టిగా చేతితో పట్టుకుంది. నిందితులు ఎన్నిసార్లు గుంజినా కార్డు వదిలిపెట్టలేదు. ఇప్పుడు అదే కార్డు ఆధారంగా పోలీసులు సదరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios