భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను గొంతు నులిమి చంపేసి శవాన్ని వంటగదిలో పాతిపెట్టింది. మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త మహేష్ మీద ప్రమీల అనుమానం పెంచుకుంది. మహేష్ వృత్తిరీత్యా న్యాయవాది.

మహేష్ సోదరుడు అర్జున్ బెనవాల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు గురువారం రాత్రి వంటగదిలో తవ్వి శవాన్ని వెలికి తీశారు.  ఈ సంఘటన అన్నుపూర్ జిల్లాలోని కరోండ గ్రామంలో చోటు చేసుకుంది. 

నెల రోజుల నుంచి మహేష్ కనిపించకపోవడంతో అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడి అదృశ్యం వెనక వదిన ప్రమీల హస్తం ఉండవచ్చునని ఆయన పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. 

అక్టోబర్ 22వ తేదీన తన సోదరుడు అదృశ్యమయ్యాడని, ఆ తర్వాత తన సోదరుడి ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని, తన వదిన తనను ఇంట్లోకి రానివ్వడం లేదని, దాంతో తనకు వదినపై అనుమానం వస్తోందని అర్జున్ పోలీసులుక చెప్పాడు. తన భర్త కనిపించడం లేదని ప్రమీల అక్టోబర్ 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.