Asianet News TeluguAsianet News Telugu

రాజకీయనాయకులు టార్గెట్.... ట్రాప్ లో పడేసిన మహిళలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన ముగ్గురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పడి కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసిన బాగోతాన్ని ఇండోర్ పోలీసులు బట్టబయలు చేశారు. 

bhopal police detains 3 woman, 1 man for alleged involvement in honey trapping cases
Author
Hyderabad, First Published Sep 19, 2019, 8:00 AM IST

ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులను ముగ్గురు మహిళలు ట్రాప్ చేశారు. వాళ్లని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ల ట్రాప్ లో చిక్కుకొని బటయపడలేక ఆ సదరు రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు నానా అవస్థలు పడటం గమనార్హం. కాగా... ఆ మహిళలను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈ  సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన ముగ్గురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పడి కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసిన బాగోతాన్ని ఇండోర్ పోలీసులు బట్టబయలు చేశారు. 

తమకు అందిన రహస్య సమాచారం మేర ఇండోర్ పోలీసులు హనీట్రాప్ చేసి డబ్బులు గుంజుతున్న ముగ్గురు మహిళలు, ఓ యువకుడిని అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తును మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios