Asianet News TeluguAsianet News Telugu

లంచం డిమాండ్ చేసిన తహాశీల్థార్: గేదెతో దిమ్మతిరిగేలా బుద్ది చెప్పిన బాధితుడు

ఎంత బతిమిలాడినా తహాశీల్థార్ కనికరించకపోవడంతో విసిగిపోయిన బాధితుడు తన పాడిగేదెను తీసుకువచ్చాడు. అంత సొమ్ము ఇచ్చుకోలనని తన గేదెను తీసుకోవాలని సిద్ధార్థ్ కారుకు కట్టేశాడు. తహాశీల్దార్ కారుకు గేదెను కట్టడంతో అనుమానం వచ్చిన స్థానికులు ప్రజలు, అధికారులు ఆరా తీయగా అసలు విషయం బాధితుడు చెప్పాడు. 

bhopal  official asks bribe for land issue gets buffalo return
Author
Bhopal, First Published Sep 12, 2019, 11:54 AM IST

భోపాల్‌: లంచం కోసం వేధిస్తున్న అధికారికి చుక్కలు చూపించాడు బాధితుడు. మెుదట లంచం ఇవ్వలేనని బాధితుడు కాళ్లవేళ్లా బతిమిలాడితే ఆ తర్వాత బాధితుడు కాళ్లే పట్టుకుని ఉద్యోగి బతిమిలాడేలా చేశాడు. తమ సమస్యను పరిష్కరించాలంటూ తహాశీల్దార్ కార్యాలయం చూట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. తమ కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విబేధాలు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరారు. 

ఎన్నిసార్లు తిరిగినా ఆ అధికారిలో ఎలాంటి చలనం రాకపోవడంతో అసలు విషయంపై ఆరా తీశాడు బాధితుడు. రూ.25వేలు లంచం ఇస్తే సమస్య పరిష్కరిస్తామని తన నిజస్వరూపం బయటపెట్టాడు తహాశీల్దార్. 

రూ.25వేలు ఉంటే ఇలా ఎందుకు తిరుగుతామని ఆవేదన వ్యక్తం చేశాడు. అంత సొమ్ము ఇవ్వలేనని ప్రాధేయపడినా కనికరించలేదు. సుమారు ఆరు నెలల పాటు బ్రతిమిలాడుతూనే ఉన్నాడు. అయినా సిద్ధార్థ్ మనసు కరగలేదు. 

ఎంత బతిమిలాడినా తహాశీల్థార్ కనికరించకపోవడంతో విసిగిపోయిన బాధితుడు తన పాడిగేదెను తీసుకువచ్చాడు. అంత సొమ్ము ఇచ్చుకోలనని తన గేదెను తీసుకోవాలని సిద్ధార్థ్ కారుకు కట్టేశాడు. తహాశీల్దార్ కారుకు గేదెను కట్టడంతో అనుమానం వచ్చిన స్థానికులు ప్రజలు, అధికారులు ఆరా తీయగా అసలు విషయం బాధితుడు చెప్పాడు. 

ఈ విషయం తెలుసుకున్న తహాశీల్థార్ సిద్ధార్థ్ బాధితుడుతో కాళ్లబేరానికి దిగాడు. లంచం వద్దు గేదెను తీసుకెళ్లాల్సిందిగా బాధితుడుని బతిమిలాడాడు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో అధికారులు తహాశీల్ధార్ పై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. 

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. విదిషా ప్రాంతం సిరోంజ్ జిల్లాకు చెందిన భూపేంద్రసింగ్ కు తన కుటుంబ సభ్యులతో భూ వివాదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకోవడం కోసం తహాశీల్థార్ కార్యాలయానికి వెళ్లాడు. 

తహాశీల్థార్ సిద్ధార్థ సింగాల్ రూ.25వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేని ఆరు నెలలుగా భూపేంద్ర సింగ్ బతిమిలాడాడు. అయినా ఆ అధికారి కనికరించలేదు. దాంతో విసుగు చెందిన బాధితుడు తన దగ్గర ఉన్న గేదెను తీసుకువచ్చి తహాశీల్థార్ కారుకు కట్టేశాడు. అంత ఇచ్చుకోలేను ఈ గేదెను తీసుకోండి అంటూ బేరానికి దిగాడు. 

తహాశీల్థార్ కారుకు గేదెను కట్టిన వ్యవహారం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో తహాశీల్థార్ స్పందించారు. లంచం వద్దు అని బాధితుడితో చెప్పుకొచ్చాడు. గేదెను తీసుకు వెళ్లిపోవాలని బ్రతిమిలాడాడు. అయితే భూపేంద్ర సింగ్ ముఖ్యమంత్రి, జిల్లా అధికారికి ఓ మెమరాండం అందజేసిన తర్వాతే గేదెను ఇంటికి తీసుకెళ్లాడు. 

ఈ విషయం కాస్తా మీడియాలో ప్రచారం కావడంతో ఉన్నతాధికారులు స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. సిద్ధార్థపై వచ్చిన ఆరోపణలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios