కరోనా వైరస్ కష్టకాలంలో ప్రజలకు తోడుగా ఉండి వారికి ధైర్యం చెప్పవలిసిన ప్రజాప్రతినిధుల్లో కొందరు ఈ సమయంలో కనబడకుండా మాయమైపోతున్నారు. ఈ జాబితాలోకి వస్తారు భోపాల్ ఎంపీ సాధ్వి ప్రగ్య ఠాకూర్. 

ఆమె కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడం మొదలైనప్పటి నుండి కనబడకుండా పోయిందని భోపాల్ అంతా పోస్టర్లు వెలిశాయి. కరోనా విరుస్తో తాము తీవ్ర అవస్థలకు గురవుతుంటే తమ ఎంపీ ప్రగ్య ఠాకూర్ మాత్రం కనబడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కనబడకుండా పోయిన తమ ఎంపీ సాధ్వి ప్రగ్య ఠాకూర్ కోసం వెదికి పట్టుకోమని కోరుతున్నారు భోపాల్ నియోజికవర్గ ప్రజలు. భోపాల్ ఎంపీ సాధ్వి ప్రగ్య ఠాకూర్ కనబడకుండా పోయిందని పేర్కొంటు భోపాల్ అంతా పోస్టర్లను అంటించారు. 

అయితే సాధ్వి ప్రగ్య ఠాకూర్ ఎయిమ్స్ లో కంటికి సంబంధించిన, కాన్సర్ సంబంధిత చికిత్స తీసుకుంటున్నారని బీజేపీ పేర్కొంది. గతంలో కూడా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, అతని తనయుడు నకుల నాథ్ కనబడడం లేదు అని పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. 

జ్యోతిరాదిత్య సింధియా, మంత్రి ఇమారతి దేవి, మరో మంత్రి లఖన్ సింగ్ ల పోస్టర్లు కూడా కనబడడం లేదు అంటూ చంబల్ ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి. 

ఇకపోతే... భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్యా రెండు లక్షలకు చేరువౌతోంది. శుక్రవారం ఉదయం 8గంటల సమయానికి  1,73,763 కేసులు నమోదైనట్టు అధికారులు చెప్పారు.

గత 24 గంటల్లో 8వేలకు పైగా కేసులు నమోదయినట్టు అధికారులు చెప్పారు. 

ఇప్పటివరకు 82,369మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా 4,971 మంది మరణించారని తెలియవస్తుంది.  ఒక్కరోజే  మంది 200 మందికి పైగా ఈ కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం 89,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ప్రస్తుతం భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలో 9వ స్థానికి చేరుకుంది. అమెరికా మొదటి స్థానంలో ఉంది. కాగా.. మరణాల్లోనూ భారత్ చైనాని దాటేయడం గమనార్హం.

మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి..