ప్రయాగరాజ్ కుంభమేళాలో 'భీష్మ క్యూబ్' అస్పత్రి ...అంటే ఏమిటి?

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భీష్మ క్యూబ్ అనే ప్రత్యేక మొబైల్ అస్పత్రిని ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ అస్పత్రి ఒకేసారి 200 మందికి చికిత్స అందించగలదు.

Bhishma Cube Mobile Hospital at Prayagraj Mahakumbh 2025 AKP

ప్రయాగరాజ్ : 2025 ఆరంభంలో అంటే వచ్చేఏడాది జనవరి, పిబ్రవరిలో ప్రయాగరాజ్ మహా కుంభమేళా జరగనుంది. ఈ మహాకుంభమేళాలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి యోగి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళాలో తొలిసారిగా భీష్మ క్యూబ్‌ను మోహరించనున్నారు. ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన విప్లవాత్మక మొబైల్ అస్పత్రి. 2024 జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవంలో కూడా భీష్మ క్యూబ్‌ను మోహరించారు.

ప్రయాగరాజ్ సంయుక్త వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ వి.కె. మిశ్రా మాట్లాడుతూ... ఒక భీష్మ క్యూబ్ 200 మందికి ఒకేసారి చికిత్స అందించగలదని తెలిపారు. భీష్మ క్యూబ్‌లో శస్త్రచికిత్స సౌకర్యాలు, డయాగ్నస్టిక్ సాధనాలు, రోగి సంరక్షణకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్యూబ్ చాలా దృఢంగా, నీటి నిరోధకతతో, తేలికగా ఉంటాయి. దీని ద్వారా తక్షణ చికిత్సను ప్రారంభించవచ్చు. ఇది వైద్య సేవల సమర్థవంతమైన సమన్వయం, పర్యవేక్షణ,  నిర్వహణ కోసం కృత్రిమ మేధస్సు (AI), డేటా విశ్లేషణలను సమగ్రపరుస్తుంది.

భీష్మ క్యూబ్ యూనిట్ మొత్తాన్ని చేతితో, సైకిల్‌తో లేదా డ్రోన్ ద్వారా కూడా సులభంగా తీసుకెళ్లవచ్చని డాక్టర్ మిశ్రా తెలిపారు. ఈ మొబైల్ అస్పత్రి ప్రత్యేకత ఏమిటంటే, అత్యవసర పరిస్థితుల్లో విమానం ద్వారా దీన్ని ఎయిర్‌డ్రాప్ చేయవచ్చు. భీష్మ క్యూబ్ 12 నిమిషాల్లోపే ఏర్పాటు చేయగలదు. ఈ పోర్టబుల్ హాస్పిటల్ క్యూబ్‌లను భారత వైమానిక దళం, భారతీయ ఆరోగ్య సేవా సంస్థలు, రక్షణ సాంకేతిక నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేసి, పరీక్షించారని డాక్టర్ మిశ్రా తెలిపారు.

ఈ ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఉక్రెయిన్ పర్యటనలో అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీకి భీష్మ క్యూబ్ యూనిట్లను బహుమతిగా అందజేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios