Bhima Koregaon Violence: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన భీమా కోరెగావ్ కేసు నుంచి శివ ప్రతిష్ఠాన్ హిందుస్థాన్ వ్యవస్థాపకుడు శంభాజీ భిడే పేరును తొలగించినట్లు పుణె రూరల్ పోలీసులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు తెలియజేశారు. భిడేపై తగిన సాక్ష్యాలు లేనందున చార్జీ షీట్ ను అతని పేరు తొలగించినట్టు పోలీసులు తెలిపారు.
Bhima Koregaon Violence: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన కోరెగావ్ భీమా కేసు నుంచి 'శివ ప్రతిష్ఠాన్ హిందుస్థాన్' వ్యవస్థాపకుడు శంభాజీ భిడే పేరును తొలగించారు. శంభాజీ భిడేపై సాక్ష్యాధారాలు లేనందున, భీమా కోరేగావ్ సాకాండ కేసులో అతని పేరును తొలిగించినట్టు పుణె రూరల్ పోలీసులు బుధవారం మహారాష్ట్ర రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) కు సమాచారం అందించారు.
సెప్టెంబర్ 2021లో శంభాజీ భిడే అల్లర్లకు పాల్పడ్డారని శిక్రాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొత్తం 22 కేసులు నమోదు కాగా 41 మంది నిందితులపై అభియోగాలు మోపారు. జనవరి 1, 2018న పూణే జిల్లాలో జరిగిన కోరెగావ్-భీమా ఘటనలో భిడేతో పాటు, మరో కరడుగట్టిన హిందుత్వ నాయకుడు మిలింద్ ఎక్బోటే కూడా IPCలోని వివిధ సెక్షన్లు మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు విచారణ సందర్భంగా పోలీసులు ఇచ్చిన సమాచారంలో శంభాజీ భిడే పేరు ప్రస్తావించలేదు. కొరేగావ్ భీమా అల్లర్ల కేసు నుండి పూణే రూరల్ పోలీసులు శంభాజీ భిడేస్ పేరును తొలగించారు. తన కేసును విచారించడం లేదని థానే న్యాయవాది ఆదిత్య మిశ్రా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో సాగుతున్న విచారణలో భీమా కోరేగావ్ అల్లర్లతో ప్రత్యక్ష సంబంధం లేదని తేల్చి చెప్పడంతో శంభాజీ భిడే పేరును కేసు నుంచి తప్పించారు. అందుకే అతని పేరును ఛార్జిషీట్‌లో తొలగించారు. భిడేపై ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున అతని పేరును ఛార్జిషీట్ నుంచి తొలగించినట్టు పూణే పోలీసు సూపరింటెండెంట్ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు.
జనవరి 1, 2018న పూణే సమీపంలోని కోరెగావ్ భీమాలో హింస జరిగింది. ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ జె.పి. ఎన్. పటేల్ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించారు.
