Asianet News TeluguAsianet News Telugu

Bhima Koregaon case: ఆ వివాస్ప‌ద కేసులో మూడేళ్ల తర్వాత సుధా భరద్వాజ్​ విడుదల

భీమా-కోరెగావ్​ కేసు (Bhima Koregaon case)లో ఆరోప‌ణ‌లెదుర్కొంటున్నన్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్​  విడుద‌లైంది. దాదాపు మూడేళ్ల జైలు జీవితం త‌రువాత బైకుల్లా జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. ఆమెకు ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్ ల‌తో  లింకులున్న‌ట్టు ఆరోప‌ణలున్నాయి.
 

Bhima Koregaon case: Lawyer-Activist Sudha Bharadwaj walks out of jail after spending 3 years behind bars
Author
Hyderabad, First Published Dec 9, 2021, 4:19 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

Bhima Koregaon case: భీమా-కోరెగావ్​ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్​ ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది. దాదాపు మూడేళ్ల జైలు జీవితం త‌రువాత బైకుల్లా జైలు నుంచి గురువారం విడుదలయ్యారు సుధా. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ముంబయిలోని జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. 

ఆమెను ఎల్గార్ పరిషత్-భీమా కోరేగావ్ హింసాకాండ కేసులో 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. భరద్వాజ్​కు​ 2021, డిసెంబర్​ 1న బాంబే హైకోర్టు డీఫాల్ట్​ బెయిల్​ మంజూరు చేసింది. డిసెంబర్​ 8న ఆంక్షాల‌తో కూడిన  బెయిల్​ ను మంజూరు చేసింది.  ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టు ఆదేశాల మేర‌కు రూ. 50,000 పూచీకత్తుపై   ఆమెకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలు అందిన తర్వాత.. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి బయటకు వచ్చారు సుధా భరద్వాజ్​.

Read Also: https://telugu.asianetnews.com/national/tri-service-enquiry-into-bipin-rawat-chopper-crash-rajnath-singh-announced-in-parliament-r3u41e

ఈ క్ర‌మంలో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను అందించారు. తన పాస్‌పోర్ట్ కోర్టులో సమర్పించాల‌నీ, ముంబాయి న‌గ‌రం దాటి వెళ్ల కూడ‌ద‌నీ, ఒక వేళ వెళ్లాల్సి వ‌స్తే.. ప్రత్యేక NIA కోర్టు అనుమ‌తి తీసుకోవాల‌ని తెలిపింది.  ఈ కేసులోని ఇత‌ర నిందితులతో ఎలాంటి సంబంధాలు ఏర్పరచుకోవద్దని, అంతర్జాతీయ కాల్‌లు చేయవద్దని కూడద‌నీ కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది.


2017, డిసెంబర్​ 31న పుణెలోని షానివార్​వాడాలోని ఎల్గర్​ పరిషద్​ కాన్​క్లేవ్​ వద్ద చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశార‌నీ. ఆ త‌ర్వాత రోజే  భీమా కోరాగావ్​ వార్​ మెమోరియల్​ వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయని పోలీసులు ఆరోప‌ణ‌లున్నాయి. ఈ క్ర‌మంలో సుధా భరద్వాజ్​తో పాటు పలువురు హక్కుల నేతలపై కేసు నమోదు చేశారు. 

Read Also: https://telugu.asianetnews.com/national/bipin-rawat-death-black-box-recovered-from-crashed-m-17-helicopter-r3u2b7

ఈ కేసును  తొలుత విచారణ చేట్టిన పుణే పోలీసులు సంచ‌ల‌న నిజాల‌ను వెలుగులోకి తీసుక‌వ‌చ్చార‌ని తెలిపారు. అలాగే  వీరికి మావోయిస్టులతో సంబంధం ఉన్న‌ట్టు పేర్కొన్నారు. ఈ కేసుపై ప‌లు ఆరోప‌ణ‌లు, రాజ‌కీయా ఒత్తిడి రావ‌డంతో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ)కు అప్పగించారు. 
దీంతో ఆమెను చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం(ఉపా) కింద 2018, ఆగస్టులోఅరెస్ట్​ చేసింది ఎన్​ఐఏ.  


హైకోర్టు డీఫాల్ట్​ బెయిల్​ మంజూరు చేసిన క్రమంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎన్​ఐఏ. అయితే, దర్యాప్తు సంస్థ పిటిషన్​ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. భరద్వాజ్​కు బెయిల్​ అర్హురాలని, అందుకు నిరాకరించటం ఆమె ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనని హైకోర్టు పేర్కొంది.

Read Also: https://telugu.asianetnews.com/cricket-sports/world-s-fastest-man-usain-bolt-is-now-eyeing-a-career-in-cricket-and-is-keen-to-play-in-the-t20-league-r3u1ya

ఇక .. ఈ కేసులో అరెస్టయిన 16 మంది నిందితుల్లో డీఫాల్ట్​ బెయిల్ పొందిన వారిలో సుధా భరద్వాజ్​ తొలి వ్యక్తి. మరో ఎనిమిది మంది బెయిల్​ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది. కవి, సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు వరవరరావు ప్రస్తుతం మెడికల్​ బెయిల్​లో ఉన్నారు. మరో నిందితుడు హక్కుల నేత స్టాన్ స్వామి మెడికల్ బెయిల్ కోసం ఎదురుచూస్తున్న స‌మ‌యంలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 5న మరణించారు. మిగిలిన వారు అండర్ ట్రయల్‌గా కస్టడీలో ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios