న్యూఢిల్లీ:భీమ్ ఆర్మీ చీఫ్  చంద్రశేఖర్ ‌ను పోలీసులు శనివారం నాడు ఉదయం జామ మసీద్ బయట అరెస్ట్ చేశారు.అతను సెక్యూరిటీ సిబ్బందికి చిక్కకుండా కొన్ని గంటల పాటు తప్పించుకొన్నాడు.

శుక్రవారం రాత్రి నుండి భద్రతా సిబ్బంది ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.  పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా  జామ మసీద్ నుండి జంతర్ మజీద్ వరకు ర్యాలీని నిర్వహించాలని  భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ప్లాన్ చేశాడు.  

చంద్రశేఖర్  జామ మసీద్ లోపల ఉన్నట్టుగా  పోలీసులకు సమాచారం అందింది.  ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొన్నారు.

పౌరసత్వ సవరణ బిల్లును  వెనక్కు తీసుకొనే వరకు తమ పోరాటం కొనసాగుతోందని చంద్రశేఖర్ చెప్పారు. తాము హింసను ప్రేరేపించేందుకు సిద్దంగా లేం, అందుకే మసీదులో శాంతియుతంగా కూర్చొన్నామని ఆయన చెప్పారు.తమ వారు ఎవరూ కూడ హింసాత్మక ఘటనల్లో పాల్గొనలేదన్నారు.

జామ మసీదుకు సమీపంలో భారీగా పోలీసులు మోహరించారు. చంద్రశేఖర్ బయటకు వచ్చే వరకు ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి నుండి మసీదు బయటే పోలీసులు ఉన్నారు. 

మసీదు నుండి బయటకు రావాలని సీనియర్ పోలీసు అధికారి చంద్రశేఖర్ ను కోరారు. శుక్రవారం నాడు రాత్రి నుండి చంద్రశేఖర్‌ను బయలకు రావాలని కోరితే  చంద్రశేఖర్ శనివారం నాడు తెల్లవారుజామున మసీదు నుండి బయటకు వచ్చేందుకు ఒప్పుకొన్నాడు.

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది.అయితే తమ వాళ్లేవరూ కూడ హింసకు పాల్పడలేదని చంద్రశేఖర్ తెలిపారు.పోలీసులే సాధారణ దుస్తులను వేసుకొని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 

జామ మసీదు సమీపంలో సెక్యూరిటీని దాటుకొని  చంద్రశేఖర్  మసీదులోకి చేరుకొన్నాడు. తలకు క్యాప్ పెట్టుకొని శాలువా కప్పుకొని  మసీదులోకి శుక్రవారం నాడు మధ్యాహ్నాం ఒకటిన్నర గంటలకు చేరుకొన్నాడు.

పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేసేవరకు తమ నిరసనను కొనసాగిస్తామని చంద్రశేఖర్ ప్రకటించారు.హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా నిరసనలను కొనసాగించాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ తెలిపారు.